చిరాకు తెప్పించే అనారోగ్య సమస్యలకు దివ్యౌషధం ఈ టీ..!

lakhmi saranya
తలనొప్పి ఎక్కువగా వస్తే టీ తాగుతారు. కానీ కొంతమంది టీ కంటే ఈ జ్యూస్ ని తాగితే వెంటనే తగ్గుతుందని నమ్ముతారు. లేదంటే మెడికల్ షాప్ కు పరుగులు తీస్తారు. కానీ టాబ్లెట్ యూజ్ చేయటం కన్నా.. సాధారణ టీ కంటే నిమిషాల్లో చికారు తెప్పించే వ్యాధుల నుంచి ఉపశ్రమమం కలిగించే టి ఒకటి ఉంది. అదే అల్లం - లెమన్ టీ. ఈ కాంబినేషన్ తో టీ తాగితే ఎంతటి తలనొప్పి అయినా ఇట్టే తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
 కేవలం తలనొప్పి మాత్రమే కాకుండా ఈ అల్లం టీ తాగితే వాంతులు, జీర్ణకోస సమస్యలు వంటి ఎన్నో వ్యాధులను దూరం చేయవచ్చు. మరి లెమన్, అల్లం టీ తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం. ముందుగా అల్లం ముక్కల్ని తురుముగా చేసుకుని.. ఒక బౌల్లో వేసి ఉడకబెట్టాలి. తరువాత లెమన్ రసాన్ని అందులో వేయండి. ఐదు నిమిషాలు అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి.. గ్లాసులో పోసుకుని గోరువెచ్చగా అయ్యాక తాగితే రోజంతా యాక్టివ్గా ఉండటమే కాకుండా పలు రోగాలను తరిమికొడుతోంది. ఒక్కసారి తయారు చేసిన టీ ని రోజుల్లో నాలుగైదు సార్లు వేడి చేసుకుని తాగవచ్చు.
 అల్లం - లెమన్ టీ కడుపు ఉబ్బరం, అజీర్ణం సమస్యలను వేగంగా తగ్గించడంలో మేలు చేస్తుంది. అలాగే వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీంతో శరీరానికి కావాల్సినంత ఇమ్యూనిటీ పవర్ అందుతుంది. అంతేకాకుండా ఈ టి జలుబు, ప్లూ వంటి వ్యాధుల నుంచి కాపాడుతుంది. మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. బరువు తగ్గించడానికి కూడా మేలు చేస్తుంది. కీళ్ల నొప్పులు, వాపు, కండరాల నొప్పి నుంచి ఉపశ్రమమం కలిగిస్తుంది. నిమ్మకాయలో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచి ... క్యాన్సర్, గుండెకు సంబంధించిన వ్యాధులను దరిచేరనివ్వకుండా చేస్తుంది. కాగా రోజుకు ఒక్కసారి అయినా ఈ టీ తాగితే ఆరోగ్యానికి మేలే తప్ప నష్టాలు లేవంటున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: