సూపర్ డూపర్ జీన్స్.. అట్రాక్టివ్ లుక్స్ మీ సొంతం.‌.!

lakhmi saranya
ఈరోజుల్లో ఆడ మగ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు జీన్స్ ని వాడుతున్నారు. మగవాళ్ళ కంటే ఆడవాళ్లే మరింతగా వాడుతున్నారు. వావ్ ఏం స్టైల్ గురూ... అని ఏ కాలేజీ పోరగాడన్న అన్నాడంటే ఎదుటి వ్యక్తి ఏదో వెరైటీ జీన్స్ ప్యాంట్ వేసుకుని వచ్చుంటాడు దాదాపు ! ఎందుకంటే ప్రస్తుతం ఇదే కదా ట్రెండ్. ఒకప్పటి బ్యాగి ప్యాంట్లు, లోడాస్ లోడాస్ షర్టులు ఇప్పుడెవరూ తీసుకోవటం లేదు. పెన్సిల్ కట్ అని, టైట్ ఫిట్ అని, బూట్ కట్ అని రకరకాల జీన్స్ ధరించడమే యంగ్ స్టర్స్ కు నచ్చుతోంది.
మరికొందరు అక్కడక్కడ హోల్స్ పడిన చింపిరి జీన్స్ కూడా వేసుకుంటుంటారు. ఇప్పుడిది మరింత మోడల్ స్టైల్ అన్నమాట. ఇక ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ఏమిటంటే... జీన్స్ ప్యాంటు కు రాగి బటన్స్ మాత్రమే ఎందుకుంటాయో తెలుసా? అంటున్నారు కొందరు. దీనిపై నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం. నిజానికి జీన్స్ ను 19 వ దశాబ్దంలో జకాబ్ డేవిడ్ అనే వ్యక్తి కనిపెట్టాడు. అప్పట్లో వ్యవసాయ కార్మికుల కోసం ఎక్కువ కాలం మన్నికగా ఉండేలా,
 ముఖ్యంగా చుట్టూ జేబులో ఉండేలా ప్యాంట్లు తయారు చేయాలన్నా ఆలోచన ఎందుకు కారణం. అలా అందుబాటులోకి వచ్చిన జీన్స్ కాలక్రమంలో మార్పులు చెందుతూ వచ్చింది. ఎన్ని రకాల ఫ్యాషన్ లు పాతబడిపోయిన జీన్స్ ను మాత్రం ఈ ప్రపంచంలో ఓల్డెస్ట్ ఫ్యాషన్ అని మాత్రం ఎవరు అనడం లేదు. ఎందుకంటే కాలంతో పాటు జీన్స్ కూడా ఆధునిక హంగులను, రంగులను సంతరించుకుంటూ యువతను అట్రాక్ట్ చేస్తూనే ఉన్నాయి. మని జీన్స్ ప్యాంటకు కేవలం రాగి బటన్స్ మాత్రమే ఎందుకని ఎక్కువగా ఉంటాయంటే... అవి చిరిగిపోకుండా ఉండేందుకు వాటి మొట్ట మొదటి నృష్టికర్త డేవిస్ రాగి రెవెట్టను అప్పట్లోనే ఉపయోగించారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: