ఆకలిని అణిచివేసే వ్యాయామం ఇదే..!

lakhmi saranya
వ్యాయామం చేయడం ఆరోగ్యానికి చాలా మంచిది. వ్యాయామం ఎక్కువగా చేయటం వల్ల బరువు అనేది ఈజీగా తగ్గుతారు. ఏ సమస్య ఉన్నా గానీ వెంటనే తగ్గుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ రోజుకి ఒక గంట అయినా వ్యాయామం చేయాలి. చేస్తే వారి ఆరోగ్యం కూడా బాగుంటుంది. అధిక వ్యాయామం ఆకలిని పెంచుతుందని చెప్తారు. భారీ వర్క్ అవుట్ సెషన్ తరువాత శరీరం క్యాలరీలను బర్న్ చేస్తుంది. శక్తి నిల్వలను తగ్గిస్తుంది. బాడీ మరిన్ని క్యాలరీలను కోరుకోవడం మూలంగా.. మనకు ఆకలిగా అనిపిస్తుంది. పరిశోధకులు కూడా ఈ దృగ్విషయాన్ని ధృవికరించారు.
 అయితే అధిక- తీవ్రత వ్యాయామం ఆకలని పెంచడానికి బదులుగా అనిచే వేయగలదని కొత్త అధ్యాయనం వెల్లడించింది. ముఖ్యంగా స్త్రీలలో ఆకలి హార్మోన్ గ్రెలిన్ స్థాయిలు తగ్గుతాయని తేలింది. ఇంతకు ముందు పరిశోధన సాధారణంగా ఎసిలేటెడ్ గ్రేరిన్ అని పిలవబడే గ్రెలిన్ కు సంబంధించిన ఒక రూపం గురించి మాత్రమే వెల్లడించింది, అయితే ఈసారి పరిశోధన రెండవ రూపమైన డి సైలేటెడ్ గ్రెలిన్ పై వెలుగు నిలిచింది. ' జర్నల్ ఆఫ్ ది ఎండ్రోకైన్ సో సైటి ' లో ప్రచురించబడిన, ఆధ్యాయనం ప్రకారం... హై ఇంటెన్సిటీ వర్కౌట్ ఎసిటెడ్, డిసైలేటెడ్ గ్రెనిన్ ను అణిచివేస్తుంది. ఈ ప్రభావం పురుషులకంటే స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తుంది.
8 మంది పురుషులు, ఆరుగురు స్త్రీలపై చేసిన వ్యాయామం ఈ ఫలితాలను వెల్లడించింది. కాబట్టి డైలీ ఒక గంట వ్యాయామం తప్పకుండా చేయండి. గుండె సమస్యలు ఉన్నవారు వ్యాయామం చేయటం వల్ల వెంటనే తగ్గుతుంది. పీసీఓడీ సమస్య మరింత ఎక్కువగా పెరుగుతుంది. కాబట్టి వ్యాయామం చేయటం వల్ల పీసీఓడీ సమస్య వెంటనే తగ్గుతుంది. రకరకాల సమస్యలు ఉన్నవారు వ్యాయామాన్ని తప్పకుండా చేయండి. ఎందుకంటే వ్యాయామం చేయటం వల్ల మైండ్ ప్రశాంతంగా అనిపిస్తుంది. అలా అనిపించి ఆరోగ్యం కూడా బాగుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: