బక్కుమంటోన్న బంగారం రేట్లు... కొనేముందు ఇవి తప్పక చెక్ చేయండి!
అయితే కొంతమంది స్వచ్ఛత, నాణ్యత విషయంలో మోసం చేసే అవకాశాలు ఉన్నాయి. కాగా నాణ్యత గల గోల్డ్ ఎలా ఉంటుంది? ఎలా పరిక్షించాలి? గోల్డ్ కొనే ముందు స్వచ్ఛమైనదా? కాదా? అని ఇలా తెలుసుకోండి. బంగారం స్వచ్ఛతను నిర్ధారించే బ్లూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనేది చాలా విశ్వసనీయమైన బంగారం సర్టిఫికేట్. కాగా హాల్ మార్క్ గోల్డ్ నాణ్యతను క్యారెట్లతో సూచిస్తుంది. అలాగే ప్రతి బంగారం ఆభరణం పై హాల్ మార్క్ ఉంటుంది. హాల్ మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబరు ప్రతి ఆభరణానికి ఉంటుంది.
ఇది బంగారం నాణ్యతను, హాల్ మార్కింగ్ రిజిస్ట్రేషన్ వంటి ఇన్ఫర్మేషన్ ను తెలుపుతుంది. అలాగే మీ ఫోన్ ద్వారా కూడా బంగారం స్వచ్ఛమైనదో కాదు తెలుసుకోవచ్చు. బీఐఎస్ అనే యాప్ మీ మొబైల్ లో డైన్ లోడ్ చేసుకుని... మీరు కొనే బంగారం వివరాలను అందులో అప్లోడ్ చేస్తే నిజమైనదో కాదు నీకు కావాల్సిన సమాచారాన్ని వెల్లడిస్తుంది. అలాగే అయస్కాంతాన్ని కూడా ఉపయోగించవచ్చు. ఒకవేళ మీరు కొన్న గోల్డ్ అయస్కాంతానికి అతుక్కుంటే అది నాణ్యత లేనిది, స్వచ్ఛమైనది కాదని అర్థం. నాణేలు, బిస్కెట్ బంగారాల కు చాలామంది ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకంటే ఇది నూరు శాతం నిజమైన గోల్డ్ కాబట్టి. మీరు బంగారం కొన్నాక తప్పకుండా బంగారం కొనుగోలు చేసిన బిల్లును తీసుకుని జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందుకంటే ఆ తరువాత ఒరిజినల్ కాకపోతే ఈ పేపర్ ఉపయోగపడుతుంది.