ఈ రోజుల్లో పెళ్లైన జంటలు చాలా మంది ఉద్యోగాలు చేస్తున్నారు. దీంతో భార్యభర్తలిద్దరూ బిజీలైఫ్ గడుపుతున్నారు. తమ వైవాహిక జీవితంలో తగిన సమయం కేటాయించలేకపోతున్నారు. దీంతో దంపతుల మధ్య ప్రేమ, సాన్నిహిత్యం తగ్గిపోతుంది. ఇక, రాను రాను వైవాహిక జీవితం చాలా బోర్‌గా అనిపించవచ్చు. ఈ విషయాన్ని ఎలాంటి పరిస్థితుల్లో కూడా లైట్ తీసుకోకూడదు. ప్రారంభంలో ఇది పెద్దగా అనిపించకపోవచ్చు. కానీ, భవిష్యత్తులో పెద్ద సమస్యగా మారి మీ వైవాహిక జీవితంలో పెద్ద కల్లోలాన్ని సృష్టించవచ్చు. అంతేకాకుండా గొడవలతో ఆగిపోకుండా లైంగిక జీవితంలో కూడా పెద్ద సమస్యలు తీసుకురావచ్చు. సంబంధం కొనసాగాలంటే సాన్నిహిత్యం ముఖ్యం.అయితే, ఉదయాన్నే కొన్ని పనులు చేయడం ద్వారా భార్యభర్తల మధ్య బంధం మరింత స్ట్రాంగ్ అవుతుందంటున్నారు నిపుణులు. రాత్రి త్వరగా నిద్రపోయి.. ఉదయాం పూట త్వరగా నిద్రలేవాలని పెద్దలు చెబుతారు. నిజానికి ఉదయాన్నే మనసు చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. ఉదయం చేసే పనులు మిమ్మల్ని చాలా యాక్టివ్‌గా ఉంచుతాయి. అందుకే భార్యభర్తలు ఉదయాన్నే కొన్ని పనుల్ని డైలీ రోటీన్లో భాగం చేసుకోవాలంటున్నారు నిపుణులు.
ప్రతి ఒక్కరూ తమ తమ పనిలో బిజీగా ఉన్నారు. చాలా మంది భార్యాభర్తలు ఉద్యోగాలు చేస్తున్నారు. ఒక మహిళ గృహిణి అయితే, ఆమె పిల్లలను చూసుకోవడం లేదా ఇంటి పని చేయడంలో బిజీగా ఉంటుంది. ఇక, సోషల్ మీడియా ఇప్పుడు చాలా జంటల సమయాన్ని దోచుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒకరికొకరు సమయం దొరకడం కష్టంగా మారింది. దీంతో.. భాగస్వాముల మధ్య దూరం పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఒకరికొకరు ఉదయం కొన్ని గంటలు తమ కోసం కేటాయించుకుంటే.. వారి రిలేషన్ డబుల్ స్ట్రాంగ్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు.దంపతులు ఉదయం ‘నా సమయాన్ని కాస్తా వీ టైమ్’గా మార్చుకోవాలి. ఉదయాన్నే లేచి టీ లేదా కాఫీతో కబుర్లు చెప్పుకోండి. మీ ఆలోచనలు, లోపాల్ని ఒకరితో మరొకరు షేర్ చేసుకోండి. అంతేకాకుండా మీ మధ్య జరిగిన మధుర జ్ఞాపకాల్ని నెమరువేసుకోండి. అంతేకాకుండా భార్యభర్తలిద్దరూ మార్నింగ్ వాక్‌కి వెళ్లవచ్చు. మార్నింగ్ వాక్ శరీరానికి మేలు చేయడమే కాకుండా దంపతుల మధ్య మానసిక బంధాన్ని ఏర్పరుస్తుంది.
అంతేకాకుండా ఉదయాన్నే వంటగదిలో ఇద్దరూ కలిసి బ్రేక్‌ఫాస్ట్ తయారు చేయవచ్చు. దీంతో భర్త భార్యకు పనిభారం తగ్గించినట్టు అవుతారు. అంతేకాదు ఆమె మనసుకు మరింత దగ్గరవుతారు. మీ భార్య ఆఫీస్ కు వెళ్తే కాస్త డ్రాప్ చేయండి.మార్నింగ్ రొటీన్లో వాకింగ్ చేయడం విసుగు అనిపిస్తే.. ఇద్దరూ కలిసి డ్యాన్స్ క్లాస్‌కి వెళ్లవచ్చు లేదా స్విమ్మింగ్ లేదా ఏదైనా స్పోర్ట్స్ యాక్టివిటీ చేయవచ్చు. ఉదయం పూట ఇద్దరూ కలిసి సైకిల్ తొక్కవచ్చు.కానీ మీరు ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేచి, మీ భాగస్వామితో మాట్లాడి, అతని/ఆమె మంచితనాన్ని నిరంతరం అభినందిస్తే, రిలేషన్షిప్లో తాజాదనం అలాగే ఉంటుంది. ప్రతిరోజూ ఏదో ఒక సాకుతో వారికి కృతజ్ఞతలు తెలియజేయండి.