అక్కడ దీపావళి అంటేనే భయం.. ఆ పేరు చెబితేనే ఆ ఊర్లో వణుకు పోతాయి ఎందుకంటే..!

frame అక్కడ దీపావళి అంటేనే భయం.. ఆ పేరు చెబితేనే ఆ ఊర్లో వణుకు పోతాయి ఎందుకంటే..!

Amruth kumar
భారతదేశంలో హిందువులు చేసుకునే పెద్ద పండుగలో దీపావళి కూడా ఒకటి .. ఈ పండగ పెద్దలు కంటే పిల్లలకే ఎంతో ఇష్టం.. పండక్కు పది రోజులు ముందు నుంచి పిల్లలు టపాసులు కాల్చడం మొదలు పెడతారు. అయితే అలాంటిది బస్సుకి దీపావళికి ఓ టిక్క టిఫన్ డి అని అడిగితే అటుగా వచ్చే కొత్త వాళ్లకు ఎవరికైనా ఆ బస్సులో ఉన్నారంటే కాస్త ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అయితే మరి రెండు ఊర్లు మాత్రం అదే పేరుతో ఉంటే.. కొంత ఆశ్చర్యంగానే ఉంటుంది. ఎందుకంటే ఓ పండగ పేరే ఆ ఊర్లకు పేరుగా మారటమే ఆ కారణం.. కొన్ని చారిత్రక అంశాలతో పాటు ఎన్నో విశేషాలకు నిలువైన శ్రీకాకుళం జిల్లాలో దీపావళి పేరుతో రెండు ఊర్లు ఉన్నాయి.

ఇక ఈ పేర్లు ఎలా వచ్చాయి అనేది తెలిస్తే కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. కొన్ని దశాబ్దాల అలా క్రితం వేరువేరుగా జరిగిన కొన్ని సంఘటనతో ఈ రెండు గ్రామాలకు దీపావళి అనే పేరు వచ్చింది. గార మండలంలో టెక్కలి మండలాల్లో దీపావళి పేట గ్రామాలు ఆ ప్రత్యేకతను  తెచ్చుకున్నాయి. ఇక గతంలో సిక్కులు రాజు ఆధీనంలో కలింగపట్నం ఓడరేవు ఉండేది. ఇక ఇప్పుడు అది గార మండలం పరిధిలో కొనసాగుతుంది. ఆ రోజుల్లో సిక్కోలు రాజు దీపావళి పండుగ రోజు కళింగపట్నం వైపు గుర్రంతో బయలుదేరాడు. అయితే మధ్య‌లో ఒక గ్రామంలో రాజు కొంత అస్వస్థకు గురై ఆయన స్పృహ తప్పి పడిపోయారు. ఇక స్థానికులు ఆ రాజుకు సపరియ్య‌లు చేసాక‌ కొద్దిసేపటికి ఆయన ఆరోగ్యం సరై తేరుకున్నారు. అయితే తన్ను కాపాడినందుకు ఆ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ.. ఆరోజు దీపావళి పండుగ  కావటంతో ఇకపై ఈ గ్రామానికి కూడా దీపావళిగా నామకరణం చేస్తున్నట్లు ఆ రాజు ప్రకటించారు. ఇక అప్పటినుంచి దీపావళి గ్రామంగా మారింది. ఇక ఈ గ్రామంలో దీపావళి  పండుగ ఏకంగా  10 రోజులు నిర్వహిస్తారట.

అలాగే అదే శ్రీకాకుళంలో టెక్కలి మండలం అయోధ్య పురం పంచాయతీలో దీపావళి పేట అనే గ్రామం కూడా ఉంది. ఈ గ్రామంలో వంద సంవత్సరాల క్రితం అందరూ పూరే గుడేసిలోనే ఉండే వారు అందరూ  ప్రతి ఇంట్లోనూ నూనె దీపాలు వెలిగించుకునేవారు.. ఒకరోజు వెలుగుతున్న దీపం ఒత్తిని  తుంటరి ఎలుక తీసుకొని ఓ ఇంటికి నిప్పుపెట్టింది. ఇక‌ దాంతో అక్కడ ఉన్న ఇల్లులు మొత్తం కాలిపోయాయి. దాంతో అప్పటి నుంచి దీపాలపేటగా పిలిచేవారు.. ఆ తర్వాత దీపావళి పేటగా మారుతూ వచ్చింది. దీపావళి పేరుతో ఉన్న గ్రామాల్లో సందడికి విరుద్ధంగా.. శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలం మండలం పున్నానపాలెంలో ఈ పండగకు ఏ సందడీ ఉండదు. రెండు వేల జనాభా ఉన్న ఈ గ్రామంలో ఏఒక్కరూ దీపావళి, నాగుల చవితి జరుపుకోరు. ఇదిచాలా ఏళ్ల నుంచి వస్తున్న ఆనవాయితీ. 150 ఏళ్ల కిందట ఈ గ్రామంలోని ఒక రైతుకు దీపావళి, నాగులచవితి పండగ చేసిన తర్వాత కష్టాలు కలగడంతో అప్పటి నుంచి ఈ పండుగలు చేసుకోవట్లేదని గ్రామపెద్దలు చెప్పారు. చిన్నపిల్లలు సైతం టపాసులు పేల్చకుండా ఉండటం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: