మొట్టమొదటిసారి ఫ్లైట్ జర్నీ చేస్తున్నారా?.. అయితే ప్రయాణానికి ముందు ఎయిర్పోర్టులో గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఇవే..!
ముందుగా అందరూ తప్పకుండా చెక్ చేసుకోవాల్సింది... పాస్ పోర్ట్ అప్డేట్ ఉందా? లేదా? అని కచ్చితంగా ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి. అలాగే ఎయిర్ పోర్ట్ కు వెళ్లే ముందే ఫ్లైట్ అప్డేట్ తీసుకోవాలి. విమానం రావటం లేట్ అవుతుందా? లేక క్యాన్సిల్ అయిందా అనే విషయాన్ని గమనించాలి. విమానంలో ఇష్టమొచ్చినంత లగేజి తీసుకెళ్లడానికి వీలుండదు. కాగా ఎయిర్ ట్రైన్ లైన్ కంపెనీ ఎన్ని బ్యాగులు, ఎంత వెయిట్ ఇస్తుందో ముందే ఇంటిలోనే బరువును చెక్ చేసుకుని వెళ్లాలి.
దీంతో అక్కడికి వెళ్లాక ఇబ్బంది పడాల్సిన పని ఉండదు. ఒక చిన్న బ్యాగ్ మీతో పాటుగా ఉంచుకోవచ్చు. అందులో పాస్ పోర్ట్ ల్యాప్ టాప్, వ్యాలెట్, చార్జర్, మీ గుర్తింపు కార్డులు లాంటివి బ్యాగులో పెట్టుకుని మీకు దగ్గరగా పెట్టుకోవచ్చు. అలాగే విమానంలో కొన్ని రకాల వస్తువులు అనుమతించారు. పదునైన వస్తువులు, మంటను పేరేపించేవి, పలు రకాల మందులు, బ్యాటరీలు వంటివి అనుమతించారు. మీరు పిల్లలతో ప్రయాణిస్తున్నట్లయితే అల్లరి చేయకుండా చూసుకోవాలి. లేకపోతే పక్క వారికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కాగా వాళ్లు ఏడవకుండా, అరవకుండా ఉండడానికి పిల్లలకు ఆట వస్తువులు లాంటివి దగ్గరగా ఉంచాలి. అలాగే సీట్ వెనక్కి రిక్లైన్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ వెనక ప్యాసెంజర్ ను గమనిస్తే చాలు.