రోగ నిరోధక శక్తిని పెంచే నాచురల్ ఫుడ్స్ ఇవే..!
పసుపు : మనం ప్రతిరోజు వంటకాల్లో వాడే ముఖ్యమైన పదార్థాల్లో పసుపు ఒకటి. ఇందులో కర్క్యూమిన్ అనే పదార్థంతో పాటు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడం ద్వారా చలికాలంలో తలెత్తే ఇన్ఫెక్షన్లను, వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి. గోరు వెచ్చని పాలల్లో చిటికెడు పసుపు కలుపుకుని తాగటం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. అల్లం, వెల్లుల్లి : ఎప్పుడు అందుబాటులోనే ఉండే అల్లం లో ఔషధ గుణాలు ఉంటాయి. యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉండటం వల్ల జలుబును తగ్గిస్తుంది.
అల్లం లోని యాంటీ ఆక్సిడెంట్స్ అజీర్తి, కడుపు ఉబ్బరం సమస్యలు దూరం చేస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచడం ద్వారా వ్యాధుల నివారణగా పనిచేస్తుంది. అల్లం టీలలో, కూరల్లో వాడటం త్వారా ఉపయోగిస్తారు. ఇక వెల్లుల్లిలో నూ అల్లిసిన్ అనే పదార్థం ఉంటుంది. యంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగి ఉన్నందున అనారోగ్యాలను దూరం చేస్తుంది. విటమిన్ సి కలిగి ఉండే నిమ్మ, దానిమ్మ, నారింజ వంటి సిట్రస్ పండ్లను చలికాలంలో తినటం మంచిది. వీటిల్లో ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్ల వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దగ్గు, ప్లూ, జలుబు, ఇన్ ఫెక్షన్లు తగ్గటంలో సహాయపడతాయి. అలాగే పాలకూర, తోటకూర, బచ్చలి కూర వంటి ఆకు కూరల్లో విటమిన్ ఏ, సి, కె ఉంటాయి. వీటిని కూరలుగా వండి తినటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.