స్నేహం కోసం కొరియన్లు ఏం చేస్తారో తెలుసా ..?
అయితే మారినా పరిస్థితుల్లో అన్ని స్నేహాలు ఒకేలా ఉండకపోవచ్చు. రోజు కలుసుకునే వీలు కాకపోవచ్చు. అయినప్పటికీ స్నేహబంధం చెడిపోకుండా అనుసరించే మార్గాలు అనేకం ఉంటాయి. అలాంటి వాటిలో కోరియన్లు అనుసరించే ' జెమనాయ్ కల్చర్' కూడా ఒకటి. ఇంతకీ ఈ సరికొత్త కలర్ ఏంటో చూద్దాం. ప్రపంచంతో పోలిస్తే కొరియన్ల లైఫ్ స్టైల్ డిఫరెంట్ గా ఉంటుందని చెప్పారు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, బంధువులు ఇలా అన్ని విషయాల్లోనూ ప్రత్యేక కలిగి ఉంటారు. పైగా వీటన్నిటికీ ఓ బడ్జెట్ ప్లానింగ్ కూడా ఉంటుంది.
అందులో భాగంగానే కోరియన్ ప్రజలు స్నేహితులతో కలిసి ' జెమనాయ్' గ్రూప్లను నడుపుతుంటారు. నిజం చెప్పాలంటే ఇది స్నేహాన్ని మరింత బలోపేతం చేసే ఆర్థిక ప్రణాళిక గా నిపుణులు చెప్తున్నారు. జెమనాయ్ గ్రూపులోని సభ్యులంతా ప్రతి ఒక్కరూ నెలకు కొంత చొప్పున డబ్బు పోగు చేస్తారు. అలా కొంతకాలం అయ్యాక జమ అయినా డబ్బుతో ఏం చేయాలో అందరూ కలిసి నిర్ణయించుకుంటారు. బడ్జెట్కు సరిపడేలా డిన్నర్లు ఏర్పాటు చేసుకోవటం, విహారయాత్రలకు వెళ్లడం చేస్తారు. ఇలా అందరూ కలిసి మెలిసి ఎంజాయ్ చేసే జెమనాయ్ కల్చర్ వల్ల ప్రజల మధ్య స్నేహబంధాలు బలోపేతం అవుతుంటాయి. అయితే స్నేహం కోసం జేమనాయ్ గ్రూపులను ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచన రావటం వెనుక ఓ ప్రత్యేక కారణం ఉందట.