ఆడవారిలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?.. అయితే ఈ వ్యాధికి సంకేతం కావచ్చు..!
ఈ రెండు రకాల థైరాయిడ్లు మనిషిని పూర్తిగా నిరసంగా మార్చేస్తాయి. ఈ వ్యాధి మగవారిలో కంటే ఆడవారిలోనే ఎక్కువగా కనిపిస్తుంటుంది. మరి ఆడవారిలో ఈ లక్షణాలు కనిపిస్తే హైపోథైరాయిడ్ కు సంకేతమని నిపుణులు చెప్తున్నారు. అవేంటో చూద్దాం. ముఖ్యంగా హార్మోన్లలో మార్పులు కనిపిస్తాయి. పీరియడ్స్ సమయంలో, పీరియడ్స్ అయినప్పుడు, మెనోపాజ్ టైం లో ఆడవాళ్లలో మార్పులు కనిపిస్తాయి. బాగా కాగా మహిళలు అప్పుడప్పుడు థైరాయిడ్ పరీక్ష చేయించుకోవటం బెటర్ అంటున్నారు నిపుణులు. ఈ వ్యాధి బారిన పడితే బద్దకం పెరిగిపోతుంది. ఏ పని చేసినా తొందరగా అలసిపోతారు. అసహనంగా ఫీల్ అవుతారు. చలిగాలి తాకినట్లయితే చికాకు వస్తుంది.
అలాగే పీరియడ్స్ ఎక్కువ రోజుల పాటు అవుతుంది. అంతేకాకుండా ఒక నెలలోనే ఎక్కువసార్లు పీరియడ్స్ వస్తాయి. థైరాయిడ్స్ సరిగ్గా పనిచేయక హార్మోన్లలో మార్పులు చోటుచేసుకుని... వెయిట్ పెరుగుతారు. శరీరంలోని కొవ్వు నిల్వను పెంచుతుంది. దీంతో అనూహ్యంగా బరువు పెరుగుతారు. ఒకవేళ థైరాయిడ్ హార్మోన్ తక్కువగా ఉత్పత్తి అయితే హెయిర్ పాల్ పుష్కలంగా కనిపిస్తుంది. స్కిన్ పొడిబారిపోతుంది. కనుబొమ్మలు కూడా రాలిపోయే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ లక్షణాలతో పాటు మహిళలకు కీళ్ల నొప్పులు వస్తాయి. కండరాలు బలహీనంగా మారిపోతాయి. ఏ పనిమీద శ్రద్ధ పెట్టలేకపోతారు. మానసికంగా కూడా బద్దకంగా అనిపిస్తుంది. కాగా ఇటువంటి లక్షణాలు కనిపిస్తే కనుక మహిళలు తప్పకుండా థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.