పచ్చిపాలు vs పచ్చి మాంసం.. ఈ రెండు ప్రాణాంతకమైనా..?
వండిన వాటికంటే పచ్చివి తినటం మంచిదని కొందరు చెబుతుంటారు. అది నిజమేనా? ఇంతకీ పోషక ఆహార నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం. కొందరు బంగాళా దుంపలను పచ్చివిగా వింటే బలం వస్తుందని చెప్తుంటారు. కానీ ఇది నిజం కాదు. పైగా అలా తినడం వల్ల ఆరోగ్యానికి నష్టం జరుగుతుంది అంటున్నారు షోషకాహార నిపుణులు. ఎందుకంటే రా పోటాటోస్ తినడం వల్ల వీటిలోని పిండి పదార్థాలు జీర్ణ వ్యవస్థను గందరగోళ పరుస్తాయి. అంతేకాకుండా వీటిలో గ్లైకో ఆల్కలాయిడ్స్ అనే విషపూరిత సమ్మేళనాలు ఉంటాయని, ఇవి జీర్ణ సంబంధిత సమస్యలకు, అలర్జీలకు దారితీస్తాయని నిపుణులు చెప్తున్నారు.
కాబట్టి పచ్చివి తినకూడదు. వండుకొని తినడమే సేఫ్. అట్లనే కొందరు రబ్బర్ లీవ్స్ అనే ఆకు కూరను పచ్చిగా తినాలని చెప్తుంటారు. అలా తినటం వల్ల ఇందులో ఉండే ఆక్యాలిక్ యాసిడ్ అనే విషపూరిత అమ్లం ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. చిక్కుడుకాయ విత్తనాలను, బొబ్బర్లను పచ్చిగా తింటే కిడ్నీల ఆరోగ్యానికి మంచి జరుగుతుందని అపోహ కూడా ఉంది. వాస్తవానికి ఇలా తినటం ఆరోగ్యానికి హానికరం. ఫుడ్ పాయిజన్ సంభవించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చిక్కుల్లో,బొబ్బర్లు వంటివి పచ్చిగా ఉన్నప్పుడు లినామరిన్ అనే సమ్మేళనాన్ని కలిగి ఉంటాయి. వండుకొని తింటే మేలు జరుగుతుంది. కానీ పచ్చిగా తింటే అందులోని లినామరిన్ సైనైడ్ గా మారుతుంది. ఇక రెడ్ కిడ్నీస్ లేదా బొబ్బర్లలో కూడా పచ్చిగా ఉన్నప్పుడు లెక్టిన్స్ కలిగి ఉంటాయి. ఇవి జీర్ణాశయంతర సమస్యలకు కారణం అవుతాయి. వండటం లేదా ఉడకబెట్టడం వల్ల అవి నాశనం అవుతాయి.