కిడ్నీ ఫెయిల్ కాకుండా క్రియాటిన్ లెవ‌ల్స్ కంట్రోల్ చేసే ఫుడ్స్ ఇవే..!

RAMAKRISHNA S.S.
కిడ్నీలో మానవ శరీరానికి ఎంతో ముఖ్యం. మనిషి జీవన విధానాన్ని కిడ్నీలు ప్రభావితం చేస్తాయి. కిడ్నీలో క్రియాటిన్ లెవెల్ అనేది ఎప్పుడు సరిపడా ఉండాలి. ఇది మామూలు మ‌నిషికి 1.4 స్థాయిలో ఉండాలి. అంత‌కు మించి ఉండ‌కూడ‌దు. కిడ్నీలు ఫెయిల్ అవ్వకుండా ఉండాలంటే మంచినీరు పుష్కలంగా తాగాల్సి ఉంటుంది. ముఖ్యంగా మంచినీరు కిడ్నీలో ఉంటే మలినాలను తొలగిస్తుంది. తద్వారా కిడ్నీలు సురక్షితంగా ఉంటాయి. అలాగే మాంసాహారం ఎక్కువగా తింటే ప్రోటీన్ పెద్ద మొత్తంలో లభిస్తుంది. దీని ద్వారా కిడ్నీలపై భారం పెరిగి క్రియాటిన్ విడుదలవుతుంది. అందుకే కిడ్నీ సమస్య ఉన్నవారు ప్రొటీన్ ఎక్కువగా ఉండే మాంసాహారం తినకుండా ఉంటే మంచిది.

ఇక కిడ్నీ సమస్యలు ఉన్నవారు అధిక సోడియం వల్ల ఇబ్బంది పడతారు. అధిక సోడియం వల్ల కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది.. ఇది రక్తంలో క్రియాటిన్‌ స్థాయిని పెంచుతుంది. తక్కువ ఉప్పు తీసుకుంటే కిడ్నీపై ఒత్తిడి తగ్గిస్తుంది. ఇది కిడ్నీ ఫంక్షన్‌ను మెరుగుపరచడానికి క్రియాటిన్‌ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఆకుకూరలు - క్యాప్సికం వంటి ఫుడ్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు కిడ్నీలను కాపాడతాయి. రక్తంలో క్రియాటిన్ స్థాయిని తగ్గించడంలో సహాయపడతాయి. పొటాషియం ఎక్కువగా ఉండే అరటి పండ్లు.. పాల ఉత్పత్తులు ప్రాసెస్ చేసిన ఆహారాలు తగ్గించడం ద్వారా క్రియాటిన్ స్థాయిని కంట్రోల్ చేయవచ్చు.

ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల రక్తంలోని క్రియాటిన్ కంట్రోల్ చేసుకోవచ్చు. తద్వారా కిడ్నీలు ఫెయిల్ అవ్వకుండా ఉంటాయి. జిమ్లో అతిగా వ్యాయామం చేస్తే రక్తంలో క్రియాటిన్ నిలవ‌లు పెంచుతుంది. అతిగా వ్యాయామం చేసే బదులుగా యోగా - వాకింగ్ చేయడం మంచిద‌ని వైద్యులు సూచిస్తున్నారు. తులసి - అశ్వగంధ వంటి హెర్బల్ టీ లు తీసుకుంటే రక్తంలో క్రియాటిన్ స్థాయిని తగ్గిస్తాయి. పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా మాత్రమే కాదు.. కేవలం పాఠ‌కుల అవగాహన కోసం మాత్రమే అందించాం.. మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే వైద్య నిపుణుల సలహాలు తప్పక పాటించండి.. వారి సూచనల మేరకే ఆరోగ్య సలహాలు పాటించండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: