చీరను బిగుతుగా కట్టుకుంటున్నారా.. అయితే క్యాన్సర్ వస్తుందట?
రోజూ చీరలు కట్టుకోవడం వల్ల కూడా ఆరోగ్య సమస్యలు అంటే నమ్ముతారా.. ఇది నమ్మడానికి ఆశ్చర్యంగా ఉన్నా గట్టిగా కట్టుకునే లంగా బొందుల కారణంగా స్కిన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. పెట్టీకోట్ లేదా చీర కింద తొడుక్కునే ఇన్నర్ చీరకు ఒక మంచి ఆకారాన్ని స్థాయి అందుకే వీటిని నెలలో చీర కట్టుకున్నప్పుడల్లా తప్పకుండా ధరిస్తుంటారు. అయితే పెట్టీకోట్ లేదా తాడు నడుము వద్ద బిగుతుగా కట్టుకోవడం వల్ల చాలా మందికి తెలియకుండానే ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి.
ఈ సమస్యను వైద్యులు "శారీ క్యాన్సర్" లేదా "పెట్టీకోట్ క్యాన్సర్" అని పిలుస్తారు. చీరను బిగుతుగా కట్టుకోవడం వల్ల కలిగే ఈ సమస్య గురించి డాక్టర్ దర్శన రాణే అనే క్యాన్సర్ నిపుణులు వివరించారు. వారు చెప్పినదేమిటంటే, చీరను బిగుతుగా కట్టుకోవడం వల్ల చర్మం తాడుకు బాగా రాసుకుపోయి గాయాలు పాలవుతుంది. ఈ గాయాలు కొన్నిసార్లు క్యాన్సర్‌గా మారే అవకాశం ఉంది.
మన దేశంలో వేడి ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వాతావరణంలో లంగా నాడాను బిగుతుగా కట్టుకోవడం వల్ల చర్మం ఎర్రబడుతుంది, దురద వస్తుంది. గ్రామీణ ప్రాంతాలలో పరిశుభ్రత సరిగా ఉండకపోవడం వల్ల చర్మం మీద చెమట, దుమ్ము చేరడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది. చాలా మంది మహిళలకు ఈ సమస్య గురించి తెలియదు. చర్మం మీద చిన్న చిన్న మార్పులు వచ్చినా వారు పట్టించుకోరు. ఈ చిన్న చిన్న సమస్యలను పట్టించుకోకపోతే, కాలక్రమంలో ఇవి క్యాన్సర్‌గా మారే ప్రమాదం ఉంది.
డాక్టర్ దర్శన రాణే ఈ సమస్య గురించి మాట్లాడుతూ, చాలా మంది మహిళలు ఈ సమస్యను తేలికగా తీసుకుంటున్నారని చెప్పారు. కానీ, ఈ సమస్యను తొలిదశలోనే గుర్తించి చికిత్స తీసుకుంటే క్యాన్సర్‌ని నిరోధించవచ్చు అని చెప్పారు. చీరలు మాత్రమే కాదు, చుడీదార్లు, దోతీలను బిగుతుగా కట్టుకోవడం వల్ల కూడా చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉందని డాక్టర్ దర్శన రాణే చెప్పారు.
ఎలా జాగ్రత్త పడాలి?
చర్మం ఎర్రబడటం లేదా పొడిబారడం వంటి సమస్యలు కనిపిస్తే లంగాను వదులుగా కట్టుకోవాలి. వెడల్పుగా ఉండే నడుము పట్టీ వల్ల ఒకే చోట ఒత్తిడి పడకుండా ఉంటుంది. పెట్టీకోట్ ఎప్పుడూ ఒకే చోట కట్టుకోకండి. ఇంట్లో ఉండేటప్పుడు వదులుగా ఉండే ప్యాంట్లు ధరించండి. బయట పని చేసేవారు తరచూ నడుము భాగాన్ని శుభ్రం చేసుకోవాలి. దుమ్ము, చెమటను తొలగించాలి. చర్మం మీద ఏదైనా మార్పు కనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.