వర్క్ అవుట్ లో ఆరోగ్యానికి ఇంత మేలు జరుగుతుందా..?

lakhmi saranya
వర్కౌట్స్ చేయడం వల్ల బాడీ ఫిట్గా ఉంటుంది. ఆరోగ్యంగా కూడా ఉంటాము. కాబట్టి డైలీ వర్కౌట్స్ను తప్పకుండా చేయండి. వ్యాయామం ఆరోగ్యానికి చాలా అవసరం. ఫిట్గా ఉండాలంటే వ్యాయామం చేయటం చాలా అవసరం. ప్రతిరోజు ఎక్సర్ సైజ్ చేయటం వల్ల మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటారు. అయితే, ఈ వ్యాయామం ఒంటరిగా కాకుండా గ్రూప్గా చేయటం వల్ల అదనపు ప్రయోజనాలు ఉంటాయి. ఫ్యామిలీ, స్నేహితులు, మీకు ఇష్టమైన వారితో కలిసి వర్కౌట్స్ చేయటం వల్ల ఆ రోజంతా ఎనర్జీగా ఉంటారు. ఈ గ్రూప్ ఎక్సర్ సైజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
 గ్రూప్ కాదు కలిసి వర్కౌట్ చేయడం వల్ల ఎక్కువ సంతోషంగా ఉండే అవకాశం ఉంటుందని ఫీట్ నెస్ నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ఒత్తిడి, అలసట, ఆందోళన వంటివి దరిచేరవు. స్నేహితులతో కలిసి వ్యాయామం చేస్తున్నప్పుడు సరదాగా ఉంటుంది. దీంతో మైండ్ కూల్ గా ఉంటుంది. ముఖ్యంగా ఫీట్ నెస్ ప్రోగెస్ విషయంలో ఇతరులతో ఎప్పటికీ పోల్చుకోకూడదు. ఒకచోట అందరూ కలిసి వ్యాయామం చేయడం వల్ల ఒకరితో ఒకరికి పరిచయాలు ఏర్పడతాయి. దీనివల్ల ఒకరి ఫిట్ నెస్ విషయాలు, గోల్స్, సలహాలు, సూచనలు వంటివి తెలుసుకోవచ్చు.
 దీంతో, గ్రూప్ లో స్నేహబంధాలు ఏర్పడతాయి. వ్యక్తిగత జీవితంలోను ఇది చాలా ఉపయోగపడుతుంది. ఒక బృందంలా మారి ఎక్సెర్ సైజ్ చేయటం వల్ల పట్టుదల పెరుగుతుంది. లక్ష్యానికి అనుగుణంగా వ్యాయామం చేయాలని అనిపిస్తుంది. చుట్టూ అందరూ వర్కౌట్స్ చేస్తుంటే మోటివేషన్ అధికమవుతుంది. ఒకవేళ ఎప్పుడైనా వ్యాయామం చేయాలని అనిపించక బద్ధకం ఉన్నట్లయితే, ఎవరో ఒకరు మోటివేట్ చేసే వ్యాయామం చేసేలా చేస్తారు. గ్రూప్గా చేరి వ్యాయామం చేస్తున్నప్పుడు ఓ ఫిట్ నెస్ ఇన్ స్ట్రక్టర్ ను నియమించుకోండి. ఇలా చేయటం వల్ల గ్రూప్ సభ్యులకు వర్కౌట్స్ చేయడానికి సులభంగా ఉంటుంది. అందరూ కలిసి వ్యాయామం చేయడం వల్ల త్వరగా వర్కౌట్స్ అలవాటుగా మారుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: