పిల్లల్లో టాస్కింగ్ స్కిల్స్ పెరగాలంటే.. ఇలా చేయండి..!
ఈ పరిస్థితి పిల్లల ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం చూపుతోందని పేరెంట్స్ కూడా ఆందోళన చెందుతుంటారు. అయితే దీనికి చక్కటి పరిష్కారం ఉందంటున్నారు నిపుణులు. స్క్రీన్లకు అలవాటు పడకుండా పిల్లలను ఇండోర్ గేమ్స్ వంటి ఆక్టివిటీస్ వైపు వారి దృష్టి మళ్లించాలని తల్లిదండ్రులకు సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలకు స్టోరీస్ చెప్పడం వల్ల వారిలో లిజనింగ్ స్కిల్స్, అలాగే క్రియేటివ్ ఐడియాస్ డెవలప్ కావడానికి దోహదం చేస్తాయి. దీంతో పాటు పిల్లల వయసును దృష్టిలో పెట్టుకుని వారికి అర్థం అయ్యేలా కదలా పుస్తకాలు చదివి వినిపించడం, వివరించడం వంటివి కూడా చేయవచ్చు. ఉత్సాహాన్ని నింపే విధంగా పలు అంశాలను జోడించి చెప్పడం ఇంకా మంచిది.
ఇవన్నీ లాంగ్వేజ్ స్కిల్స్ డెవలప్ కావడానికి దోహాద పడతాయి. అలాగే ఎంపిక చేసిన బుక్స్ కూడా పిల్లలతో చదివించవచ్చు. కొన్ని వస్తువులను ఆయా ప్లేస్‌లలో పిల్లల ద్వారా పెట్టించి, తరువాత ఏ వస్తువు ఎక్కడ ఉంటాయో అడగటం వంటివి చేస్తుంటే వారిలో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. బెడ్ పై ఉండే దిండ్లు, దుప్పట్లు, వివిధ ఆట బొమ్మలను ఉపయోగించి గుహల మాదిరి నిర్మించడం, పక్షులకు అవసరమైన స్థావరాల ఆకారాలు క్రియేట్ చేయడం వంటి ఇమేజినేషన్ ఇండోర్ గేమ్స్ ను ప్రోత్సహించడం ద్వారా పిల్లల్లో క్రియేటివిటీ, మల్టీ టాస్కింగ్ అండ్ ప్రాబ్లం సాలోయింగా స్కిల్స్ పెరుగుతాయని పునులు పేర్కొంటున్నారు.