మీ స్మార్ట్ ఫోన్స్ స్క్రీన్ ను ఎవరైనా రికార్డ్ చేస్తున్నారా?.. లేదా?.. అనేది ఇలా తెలుసుకోండి..!
సైబర్ నేరగాళ్లు టెక్నాలజిని దుర్వినియోగం చేస్తుండటంతో ఫోన్లు హ్యాక్ అవడం, ప్రైవసి పరమైన ఇబ్బందులు తలెత్తడం వంటి సంఘటనలు తరచుగా ఎక్కడో ఒకచోట జరుగుతున్నాయి. హ్యాకర్లు యూజర్ల ఫోన్ స్క్రీన్ ను సీక్రెట్ గా రికార్డ్ చేస్తూ బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీ చేయడం, పాస్ వర్డ్స్, ప్రైవేట్ సమాచారం దొంగలించడం వంటివి చేస్తున్నారు. అయితే అలాంటి అనుమానం మీ మదిలో మెదిలితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మీ ఫోన్ గ్యాలరీలో మీరు ఎప్పుడు చెయ్యకపోయినా స్క్రీన్ రికార్డుంగ్స్ ఏమైనా ఉన్నట్లు కనిపిస్తే ఏదో జరుగుతోందని అనుమానించండి.
ఎందుకంటే మీ ప్రమేయం లేకుండా హ్యాకర్లు చేసి ఉండవచ్చు. అలాగే స్క్రీన్ పై చిన్న గ్రీన్ లైట్స్ కనిపిస్తే మీ ఫోన్ను ఎవరో సీక్రెట్ గా రికార్డ్ చేస్తుండవచ్చు. మీ ఫోన్ కామెరా, ఆడియో ద్వారా సైబర్ నేరగాళ్లు సమాచారాన్ని రికార్డ్ చేసే అవకాశం ఉంది. మీ ఫోన్ మైక్ వాడకపోయినా, అలాగే స్టేటస్ బార్ లో మైక్ సిగ్నల్స్ కనిపిస్తున్న ఏదో ప్రాబ్లం ఉందని అర్థం చేసుకోవాలి. అది హ్యాక్ అయ్యి కూడా ఉండవచ్చు. ముఖ్యంగా సెట్టింగ్ లలో మీరు పర్మిషన్ ఇవ్వకపోయినా మైక్ ఆన్ అవ్వడం, సమాచారం రికార్డ్ అవడం జరిగితే తప్పకుండా హాక్ అయినట్లే అంటున్నారు నిపుణులు. అలాగే ఫోన్ బ్యాటరీ మరి త్వరగా ఖాళీ అవుతుంటే కూడా మీ స్మార్ట్ ఫోన్ బ్యాగ్రౌండ్ లో ఏదో ఒక సీక్రెట్ యాప్ పనిచేస్తుండవచ్చు. దీంతోపాటు హానికరమైన యాప్ లేదా సాఫ్ట్ వేర్ మీ ఫోన్ లోని మెమోరీని ఎక్కువగా వాడుతుంటే ఫోన్ స్లోగా పనిచేస్తుందని కూడా నిపుణులు చెప్తున్నారు.