చలికాలంలో చెవులు దురద వస్తుందా?.. అంటే ఈ కారణాలే కావచ్చు..!

lakhmi saranya
చలికాలంలో చెవిలో దురద అనేది మరీ ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఆ దురద వచ్చినప్పుడు చెవిలో ఈర్బర్స్ పెట్టి ఎక్కువగా తిప్పుతూ ఉంటాము. ఇలా తిప్పితే చెవిలో హాయిగా ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకని చలికాలంలో ఎక్కువగా ఎయిర్బడ్స్ పెట్టి చెవిలో తిప్పుతూ ఉంటాము. చలికాలంలో సాధారణంగా తలెత్తే సీజనల్ సమస్యల్లో చెవిపోటు, చెవిలో దురద, ఏవో వింత శబ్దాలు వినిపించడం వంటివి కూడా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.
 ముఖ్యంగా అత్యధిక మందిని దురద సమస్య వేధిస్తుంది. దీంతో అగ్గిపుల్లలకు దూది చుట్టి కొందరు, పిన్నీసులు పెట్టి కొందరు చెవిలో గోక్కుంటూ ఉంటారు. అయితే ఈ దురద సమస్య రెగ్యులర్ గా వస్తుంటే మాత్రం ఇయర్ వ్యాక్స్ పేరుకుపోవడం లేదా ఏదైనా వ్యాధి లక్షణం కూడా కావచ్చు అంటున్నారు నిపుణులు. బయటి పరిసరాల్లో తిరుగుతున్నప్పుడు దుమ్ము, ధూళి ఆలు చెవిలోకి చేరుతుంటాయి. చెవి గొడలపై పేరుకుపోతుంటాయి. చల్లటి గాలి చెవి లోపలికి ప్రవేశిస్తూ ఉంటుంది. ఇలాంటి కారణాల వల్ల కూడా దురద, వింత శబ్దాలు వస్తాయని నిపుణులు చెప్తున్నారు.
ఇలా రాకుండా ఉండాలి అంటే చెవిలో కొంచెం దూది పెట్టుకోవడం మంచిది. చలిగాలి వెళ్లకుండా ఉంటుంది. కాబట్టి చెవిలో మురికి పేరుకుపోయినట్లు గమనించగానే కాటన్ బడ్ తో శుభ్రం చేసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే డాక్టర్లు సలహాతో ఇయర్ డ్రాప్స్ కూడా వాడొచ్చు. చలికాలంలో జలుబు, అలర్జీలు, ఇన్ఫెక్షన్లు, ఎగ్జిమా, సోడియాసిస్ ట్వంటీ సమస్యలు కూడా చెవిలో దురద రావడానికి కారణం అవుతుంటాయని చెవి, ముక్కు, గొంతు వైద్య నిపుణులు అంటున్నారు. సమస్య ఏదైనా వైద్య నిపుణుల సలహా పాటించడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి చెవు నొప్పిగా అనిపిస్తే వెంటనే వైద్యులని సంప్రదించండి. ముఖ్యంగా అత్యధిక మందిని దురద సమస్య వేధిస్తుంది. దీంతో అగ్గిపుల్లలకు దూది చుట్టి కొందరు, పిన్నీసులు పెట్టి కొందరు చెవిలో గోక్కుంటూ ఉంటారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: