మిగిలిపోయిన చపాతీలతో టేస్టీ నూడిల్స్.. తయారీ విధానం ఇదిగో..!
అదెలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మిగిలిపోయిన చపాతీలు, క్యారెట్, క్యాబేజీ, క్యాప్సికమ్, వెల్లుల్లి, గరం మసాలా, సోయా సాస్, నూనె, ఉప్పు, మిర్యాల పొడి. మిగిలిపోయిన చపాతీలను ముక్కలుగా చేసుకోవాలి. క్యారెట్ ను ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తరువాత క్యాప్సికమ్, క్యాబేజీని చిన్న చిన్న ముక్కలుగా నూడిల్స్ ఆకారంలో కట్ చేసుకోవాలి. ఆ తరువాత కడాయిలో నూనె వేసి,నూనె కాగిన తరువాత వెల్లుల్లి, కూరగాయలు వేసి వేయించుకోవాలి. అవి బాగా వేగిన తరువాత చపాతి ముక్కలను వేసి కలపాలి. ఒక్క పది నిమిషాలు ఫ్రై అయ్యాక.
ఇక, చివరిగా గరం మసాలా, సోయాసాస్, ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. చిన్న మంట మీద కొద్దిసేపు వేడి చేస్తే నోరు ఊరించే చపాతి నూడిల్స్ రెడీ. దీనిని ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఒక్కసారి చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటుంది. చపాతీలు కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ టేస్టీ చపాతి న్యూడిల్స్ చేసుకోండి. చపాతి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. షుగర్ వ్యాధి ఉన్నవారు చపాతీనే తింటారు. రైస్ తినటం వల్ల అనేక సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ సమస్య ఉన్నవారు చపాతీల్ని ఎక్కువగా తింటూ ఉంటారు. మిగిలిపోయిన చపాతీలను ముక్కలుగా చేసుకోవాలి.