పిల్లల్లో టైప్ 1 డయాబెటిస్.. వీరిలో ఎక్కువ ఛాన్సెస్..!
కొందరికి రెండేళ్ల వయసులో,మరికొందరికి పదహారేండ్ల వయసులో వస్తోంది. అయితే ఇది వచ్చే అవకాశం పిల్లలలతో పోలిస్తే మగపిల్లల్లోనే ఎక్కువని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అందుకు కారణాలేమిటి? ఎలాంటి సమస్యలు తలెత్తుతాయో ఎప్పుడూ చూద్దాం. చిన్న వయసులో మధుమేహం రావడం వల్ల పిల్లలు ఎదుగుదల సమస్యలు ప్రారంభం అయ్యే అవకాశం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. అలాగే వారు బాలాన్ని మిగతా వారిలాగా సరిగ్గా ఆనందించలేకపోవచ్చు. ఎందుకంటే ఆహారం విషయంలో పరిమితుల కారణంగా ఇష్టమైన ఫుడ్ తినలేరు.
పలు అనారోగ్య సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. దీంతో మానసికంగానూ సమస్యలు ఎదుర్కొంటారు. ఇకపోతే టైప్ 1 మధుమేహం వచ్చే అవకాశం, అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిల్లోనే ఇది ఎక్కువగా ఉంటుంది. శరీర నిర్మాణంలో తేడాలు, కొన్ని రకాల హార్మోన్లు సమ్మేళనాలు ఎందుకు కారణం అవుతాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా టైప్ 1 డయాబెటిస్ ఐదేండ్లకంటే తక్కువ వయసున్న పిల్లల్లో కనిపిస్తుంది. ఇది ఇన్సులిన్ సరిగ్గా లేనప్పుడు ప్రారంభం అవుతుంది. దీనికి పర్యావరణ కారణాలు, రోగ నిరోధక వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవడం కూడా కారణంగా చెప్పవచ్చు. అలాగే ఇది చీర క్రియా పనితీరు, రోగనిరోధక వ్యవస్థ పనితీరుపై కూడా ఆధారపడి ఉంటుంది.