పిల్లల బ్రెయిన్ స్మార్ట్ గా పని చేయాలంటే.. ఈ ఆహారాలు పెట్టాల్సిందే..!

lakhmi saranya
చాలామంది పిల్లలకు తెలివి అనేది అసలు ఉండదు. చదువులో కూడా వెనుకబడి ఉంటారు. తెలివి లేని పిల్లలు ఈ ఆహారాన్ని తీసుకోవటం మంచిది. పిల్లలు ఒక స్థాయికి ఎరిగే వరకు కూడా తల్లిదండ్రులు వారిపై శ్రద్ధ చూపుతారు. ముఖ్యంగా వాళ్ళకి ఇచ్చే ఆహార విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ, ఎదిగే పిల్లల ఆహార విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను మేధావులు కావాలని కోరుకుంటారు. మేధావులు కావాలంటే కేవలం పాఠశాలలకు పంపించడం, చిన్నతనంలోనే రాయడం, చదవటం నేర్పించడం కాదు. వారికి పోషణనిన్చే ఆహారం ఇవ్వడం ముఖ్యం. పోషకాహారం ఇవ్వటం వల్ల పిల్లల్లో జ్ఞాపకశక్తి, ఏకాగ్రతతో పాటుగా మెదడు పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
 పిల్లలకు రోజూ ఎలాంటి ఆహారం ఇవ్వాలో ఇక్కడ చూద్దాం. పిల్లలకు పెరుగు తినిపిస్తే మంచి ప్రయోజనాలు ఉంటాయి. ఇది ప్రోబయోటిక్ అవసరాలను తీరుస్తుంది. ఇందులో ఉండే మంచి బ్యాక్టీరియా పిల్లలను చురుగ్గా ఉంచేందుకు సహాయపడుతుంది. ఈ బ్యాక్టీరియా జీవక్రియను వేగవంతం చేస్తుంది. దీనివల్ల అజీర్తి సమస్యలు తగ్గుతాయి. పెరుగులో కాల్షియం, ఫాస్పరస్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఇది మెదడు, గుండెకు ప్రయోజనం చేకూర్చి, ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.
పిల్లలకు పెరుగును క్రమం తప్పకుండా తినిపించడం వల్ల సీజనల్ వ్యాధులు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని నిపుణులు అభిప్రాయం. ఇవి పిల్లల మెదడును చురుకుగా ఉంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా శరీర అవయవాలు క్రమంగా పనిచేయడానికి తోడ్పడుతుంది. వాల్ నట్స్, అవిసె గింజలు, గుడ్లు, చేపలు, ఆకుకూరలు, కూరగాయలలో ఒమేగా -3 పుష్కలంగా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ లో ఉండే ఫ్యాటి యాసిడ్స్ పిల్లల మెదడును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మొలకలలో ఫైబర్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని ఉదయం, సాయంత్రం పిల్లలకు తినిపిస్తే, మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: