తేనెటీగలు అంతరించిపోతే మానవ జాతికే ముప్పు...!

lakhmi saranya
తేనెను ఉదయం నీటిలో కలుపుకుని తాగితే ఆరోగ్యం బాగుంటుంది. తేనెలో ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి డైలీ తేనెను తప్పకుండా తినండి. తేనెటీగలు అంతరించిపోతున్న సంగతి తెలిసిందే. తేనెటీగలు అంతరించి పోతే వచ్చే ప్రమాదాలు ఇవే! మానవులు, మొక్కలు, జంతువులు పర్యావరణం మధ్య సమతుల్యతను కాపాడటంలో తేనె తీగలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. తేనెటీగలు లేకపోతే ఆహార కొరత ఏర్పడుతుంది. ఎందుకంటే ఇవి పరాగసంపర్కం ద్వారా వ్యవసాయ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది.
 ప్రపంచంలో తేనెటీగలు అంతరించిపోతే ఆ తరువాత మానవజాతి కూడా కనుమరుగవుతుంది. వాతావరణం లో మార్పులు, అడవుల నరికివేత, పురుగు మందులు, రసాయనాల వాడకం, వాయు కాలుష్యం కారణంగా తేనె తీగల సంఖ్య తగ్గిపోతుంది అని ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ తెలిపింది. అంతేకాకుండా ఈ తరహా లోనే సీతాకోకచిలుకలు, హమ్మింగ్ బర్డ్ వంటి పరగ సంపర్క జీవులకు ముప్పు ఎక్కువగా పొంచి ఉందని తెలియజేసింది. పరాగసంపర్కం కోసం మనుషులు తేనెతీగలను కాపాడుకోవాలి. అవి ప్రపంచంలోనే అత్యుత్తమ పరగ సంపర్క జీవులు. ఇవి అంతరించిపోతే, మొక్కలపై తీవ్ర ప్రభావం పడుతుంది.
అప్పుడు ఆహార ఉత్పత్తి క్రమంగా తగ్గుతుంది. ఇవి పువ్వుల లోని పొప్పడి, మకరందం రెండిటిని ఆహారంగా తీసుకుంటాయి. మరొక విషయం ఏమిటంటే... ఇవి ఎక్కువ సువాసనను వెదజల్లే మల్లె, గులాబీ వంటి పూల నుంచి ఆహారం తీసుకోవు. మామిడి, పొద్దు తిరుగుడు పువ్వులు, నువ్వులు, మునగ పుల వంటి వాటి నుంచి ఎక్కువగా ఆహారం సేకరిస్తాయి. ఏ ఋతువులో ఏ పూలు పూస్తాయి అనే విషయం కూడా వీటికి తెలిసిపోతుంది. ఇవి చాలా తెలివిగలవి. వాసనను పసిగట్టి, తమ ఆహారం ఎక్కడుందో తెలుసుకుంటాయి. పుప్పొడి రేణువులు ఒక పువ్వు నుంచి మరొక పువ్వు కిలాగ్రానికి పరిగ సంపర్కం జరుగుతుంది. దీనివల్ల పండ్లు, గింజలు తయారవుతాయి. తేనెటీగలు, సీతాకోకచిలుకల వల్లే 80 శాతం మొక్కల పరాగ సంపర్కం జరుగుతుందని ఐక్యరాజసమితి తన నివేదికలో వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: