మ్యాన్‌హోల్స్ మూతలు ఎందుకు రౌండ్‌గానే ఉంటాయి.. ఈ విషయం తెలుసా?

praveen
మ్యాన్‌హోల్స్ ప్రత్యక్షంగా గానీ లేదంటే టీవీల ద్వారా గానీ మీరు చూసే ఉంటారు. వీటిలో పడిపోయి చాలామంది చనిపోతుంటారు కూడా. మ్యాన్‌హోల్స్ చాలా జాగ్రత్తగానే తయారు చేస్తారు కానీ వాటిపై మూతలు పెట్టకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తుంటారు మునిసిపాలిటీ వాళ్లు. దీని వల్లనే ప్రమాదాలు జరుగుతుంటాయి. సిటీ ఏరియాలు, నీటి కాలువలు, మొక్కలు ఉన్న చోట మనం చూసే మ్యాన్‌హోల్ మూతలు రౌండ్‌గానే ఉండటానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది.
అదేమిటంటే, అవి గుండ్రంగా ఉన్నప్పుడు అవి కాలువలో పడిపోవు అనే భయం ఉండదు. ఉదాహరణకు, ఒక చదరపు ఆకారంలో ఉన్న మూతను ఎత్తినప్పుడు, కొద్దిగా వంగితే అది లోపల పడిపోయే ప్రమాదం ఉంటుంది. కానీ గుండ్రని మూతను ఎలా తిప్పినా, ఎంత వంచినా అది కాలువలో పడిపోదు. ఎందుకంటే గుండ్రని వస్తువు ఏ కోణంలో ఉన్నా, దాని ఆకారం ఒకేలా ఉంటుంది. అందుకే మ్యాన్‌హోల్ మూతలను గుండ్రంగా తయారు చేస్తారు. ఇది చాలా సురక్షితమైన పద్ధతి.
మ్యాన్‌హోల్ మూతలు గుండ్రంగా ఉండటానికి మరో ముఖ్యమైన కారణం ఏంటంటే, వాటిని తేలికగా తరలించవచ్చు. చదరపు ఆకారంలో ఉన్న మూతలను ఒకచోటి నుంచి మరో చోటికి తీసుకెళ్లాలంటే ఎత్తుకోవాలి. కానీ గుండ్రని కవర్‌ను నేలమీద సైకిల్ టైర్ ను తిప్పుకుంటూ వెళ్లినట్టు ఈజీగా తీసుకెళ్లవచ్చు. ఇది పనివారికి చాలా సౌకర్యంగా ఉంటుంది. అంతేకాకుండా, గుండ్రని మూతలను కాలువపై సరిగ్గా అమర్చడం కూడా చాలా సులభం. చదరపు ఆకారంలో ఉన్న మూతలను అమర్చాలంటే నాలుగు వైపులా సరిగ్గా సర్దుబాటు చేయాలి. కానీ గుండ్రని మూతను ఎక్కడైనా పెడితే అది సరిగ్గా అమరిపోతుంది. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశం తక్కువ.
మ్యాన్‌హోల్ మూతలను గుండ్రంగా తయారు చేయడం వల్ల నిర్మాణ పరంగా చాలా లాభాలు ఉన్నాయి. ఒక నిర్దిష్ట పరిమాణంలో ఉన్న చదరపు మూత కంటే గుండ్రని మూతలను తయారు చేయడానికి తక్కువ పదార్థం సరిపోతుంది. అంటే, గుండ్రని మూతలు తయారు చేయడానికి తక్కువ ఖర్చు అవుతుంది. అంతేకాకుండా, గుండ్రని ఆకారం వల్ల మూతలపై పడే బరువు సమానంగా పంపిణీ అవుతుంది. రోడ్డుపై వాహనాలు తిరిగేటప్పుడు మూతలపై చాలా బరువు పడుతుంది. ఈ బరువును రౌండ్‌గా ఉన్న మూత సులభంగా తట్టుకుంటుంది. అంటే, గుండ్రని మూతలు ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: