ఈ లక్షణాలు కనిపిస్తే బి కేర్ ఫుల్...! మీలో ఆ లోపం ఉన్నట్లే!

frame ఈ లక్షణాలు కనిపిస్తే బి కేర్ ఫుల్...! మీలో ఆ లోపం ఉన్నట్లే!

lakhmi saranya
చలికాలం వచ్చిందంటే చాలు కీళ్ల నొప్పులు మరింతగా పెరిగిపోతాయి. చలికాలంలో ప్రతి ఒక్కరికి కీళ్ల నొప్పులు అనేవి వస్తాయి. ఎందుకంటే చల్లటి గాలి వల్ల నొప్పులు మరింతగా పెరుగుతాయి. చలికాలంలో చాలామంది ఎదుర్కొనే సాధారణ సమస్యల్లో కీళ్లు, నడుము నొప్పులు ఒకటి. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. వింటర్లో కూల్ వెదర్ కారణంగా నొప్పి మరింత అధికం అవుతుంది. కండరాల కదలికల్లో ఇబ్బందులు తలెత్తుతాయి. నరాలు, ఎముకల్లో బలహీనత వంటి హెల్త్ ఇష్యూస్ తలెత్తుతుంటాయి.
వీటికి ప్రధాన కారణం కాల్షియం లోపమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే సమస్యను ముందుగానే గుర్తిస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు. కాబట్టి కాల్షియం లోపం కనిపించే లక్షణాలు ఏవో ఇప్పుడు చూద్దాం. కొద్దిసేపు కూర్చున్నా కాళ్లు, చేతులు, వీపు భాగం మొద్దుబారినట్లు అనిపిస్తే అది కాల్షియం లోపానికి సంకేతం కావచ్చు అంటున్నారు నిపుణులు. అలాగే నోటి చుట్టు తిమ్మిరి లేదా మొద్దు బారడం వంటి లక్షణాలు, నరాల మధ్య కమ్యూనికేషన్ లోపించిన అనుభూతి వంటివి కూడా కాల్షియం లోపం వల్ల తలెత్తే ఇబ్బందులే అంటున్నారు పోషకాహార నిపుణులు. శరీరంలో కాల్షియం చాలావరకు ఎముకల్లో, దంతాల్లో ఎక్కువ స్టోర్ ఉంటుందని నిపుణులు అంటున్నారు. మీరు డైలీ తీసుకునే ఆహారం ద్వారా అది శరీరానికి అందుతుంది.
అయితే సరైన లెవెల్స్ లో కాల్షియం అందకపోతే గనుక అప్పటికే ఎముకల్లో, దంతాల్లో స్టోర్ అయి ఉన్న కాల్షియాన్ని బాడీ యూజ్ చేసుకుంటుందని, దీనివల్ల అవి బలహీనంగా మారుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. దీర్ఘకాలం ఈ పరిస్థితి కొనసాగితే బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం ఉంటుంది. దీంతో చిన్న గాయాలైన ఎముకలు విరగడం లేదా అధికంగా డామేజ్ అవ్వటం కాల్షియం లోపానికి సంకేతం. బాడీలో తగినంత కాల్షియం లేకుంటే రాత్రులు నిద్ర సరిగ్గా పట్టదని నిపుణులు చెబుతున్నరు. ఎందుకంటే నిద్రకు సహకరించే మెలటోనిన్ అనే హార్మోనల్ ఉత్పప్తికి కాల్షియం చాలా అవసరం. కాబట్టి కాల్షియం లోపం ఉన్నప్పుడు నిద్ర చక్రాన్ని కొనసాగించే మెటోనిన్ లెవెల్స్ పడిపోతాయి. నిద్రలేమి సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: