రుచికరమైన స్ట్రాబెర్రీ చీజ్ కేక్ ను ఇలా తయారు చేసుకోండి..!

lakhmi saranya
ఎవరిదైనా బర్త్డే వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరూ కూడా కేక్ ని కట్ చేస్తున్నారు. చిన్నా పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ బర్త్డే పార్టీ నే జరుపుకుంటున్నారు. బర్త్డేకి లేదా మ్యారేజ్ డే కి ఇలా ప్రతి ఒక్క డే కి కూడా కేక్ ని కట్ చేస్తున్నారు. వివాహానికి, పుట్టినరోజులకు చిన్న చిన్న ఫంక్షన్లకు కేక్ కట్ చేసి వేడుక చేసుకుంటారు. ఈ కేక్ లలో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. పిల్లలు, పెద్దలు అందరూ కూడా కేక్ ను ఇష్టంగా తింటుంటారు.
మరి అలాంటి రుచికరమైన కేకును స్ట్రాబెరీ చీజ్, వెనీలా ఐస్ క్రీమ్ తో ఇంట్లోనే టేస్ట్ గా తయారుచేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం ఈ స్ట్రాబెరీ చీజ్ కేక్ ను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ కేకు చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒక్కసారి తింటే మళ్ళీ వదిలిపెట్టరు. ముందుగా ఒక బౌల్లో వాటర్, మైదా, పంచదార, వెనిలా ఎసెన్స్, కోకోపౌడర్, బేకింగ్ సోడా, గుడ్లు వేసుకోవాలి. ఈ మొత్తం విశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. తరువాత అందులో పెరుగు వేసుకునే బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తరువాత బేకింగ్ పాన్ లేదా కేక్ టీన్ తీసుకొని, దాని చుట్టూ బటర్ ను అప్లై చేయాలి.
కలుపుకున్న విశ్రమాన్ని పాన్ లో వేసుకోవాలి. తరువాత స్ట్రాబెరీ లను సన్న ముక్కలుగా కట్ చేసుకుని, ఈ విష్టమంపై వెయ్యాలి. ఒక మందపాటి గిన్నెను తీసుకొని అందులో ఉప్పు లేదా ఇసుగా వేసుకొని, స్టాండ్ పెట్టి మూత పెట్టాలి. ఐదు నిమిషాల పాటు గిన్నెను ప్రీ హీట్ చెయ్యాలి. ఇలా హీట్ చేసుకున్న గిన్నెలో కేక్ విశ్రమం ఉంచిన టిన్ ని ఉంచాలి. ఇలా 30- 35 నిమిషాల పాటు చిన్న మంట మీద ఉడికించుకోవాలి. అంతే రుచికరమైన స్ట్రాబెరీ చీజ్ కేక్ రెడీ. ఈ టేస్టీ టేస్టీ కేకును మీరు కూడా తయారు చేసుకోండి. ఒక్కసారి చేసుకుని తింటే చాలు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: