స్ట్రేస్ ని తగ్గించుకోవాలనుకుంటున్నారా...? అయితే వీటిని తినండి!

lakhmi saranya
ఈరోజుల్లో ప్రతి ఒక్కరూ స్ట్రెస్ కి గురవుతున్న సంగతి తెలిసిందే. స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు ఒంటరిగా ఉండాలని అనిపిస్తుంది. స్ట్రెస్ ఉన్నప్పుడు ఆకలి కూడా వెయ్యదు. ఈ ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరు ఒత్తిడికి గురవుతున్నారు. మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఒత్తిడి లేకుండా ప్రశాంతమైన జీవనం గడపాలి. ఈ ఉరుకులు పరుగుల జీవితంలో సరైన ఆహారం, వ్యాయామం వంటివి చెయ్యకపోవటం వల్ల ప్రతి ఒక్కరూ ఒత్తిడి, డిప్రెషన్ కు గురవుతున్నారు.
ఈ సమస్య కామ్ గా అనిపించవచ్చు. కానీ, ఈ మానసిక సమస్యలే రోజులు పెరుగుతున్న కొద్ది శారీరక సమస్యలకు కారణం అవుతాయి. దీనిని నిర్లక్ష్యం చేస్తే రిస్క్ లో పడతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మితిమీరిన ఒత్తిడి కారణంగా బీపీ, షుగర్, గుండె జబ్బులు వంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే, మనం తీసుకునే ఆహారాలు కొన్ని మానసిక ఒత్తిడిని తగ్గించి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. అవి ఎలాంటి ఆహారాలో ఇప్పుడు తెలుసుకుందాం. సాల్మన్, మాకేరెల్, సార్డినెస్ వంటి కొవ్వు చేపలు మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. ఈ చేపల్లో ఒమేగా-3 ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి.
 ఇవి ఒత్తిడిని తగ్గించి, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. స్ట్రెస్ ను తగ్గించి, శారీరకంగా ఆరోగ్యంగా ఉండటానికి ఆకుకూరలు సహాయపడతాయి. వీటిలో ఉండే మెగ్నీషియం ఆరోగ్యానికి ఎంతగానే ఉపయోగపడుతుంది. అంతేకాకుండా భావోద్వేగాలకు కారణమయ్యే మెదడులోని న్యూరోట్రాన్స్మిటర్లను నియంత్రిస్తుంది. బ్లూ బెర్రీలు అద్భుతమైన ఆహారం. ఇవి ఆక్వికరణ ఒత్తిడిని తగ్గించి, మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. వీటిని స్మూతీలు, ఓట్స్ వంటి వాటిలో తింటే మంచిది. ఇది మాత్రమే కాకుండా స్ట్రాబెరీ, బ్లాక్ బెర్రీ వంటి రకరకాల బెర్రీలు తినటం వల్ల శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు ఉపయోగపడతాయి. ఇవి శరీరంలోని ఆక్సికరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. ఒత్తిడిగా అనిపించినప్పుడు ఆక్పికరణ తక్కువగా ఉంటుంది. అలా జరగకుండా ఉండేందుకు దానిమ్మ శక్తిని ఇస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. దీన్ని పెరుగు, సలాడ్ లో కలుపుకుని తింటే మంచిది. బీట్రూట్ లోని నైట్రిక్ ఆక్సైడ్ అధికంగా ఉంటుంది. ఇది రక్త ప్రసన్నను మెరుగుపరిచి, రక్త పోటును నియంతరించడంలో సహాయపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: