మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే, ప్రోటీన్ లోపం ఉన్నట్లే!
ఆహారం ద్వారానే శరీరానికి ప్రోటీన్లను అందించాలి. రోజులో కావాల్సినంత ప్రోటీన్లు తీసుకోకపోతే అది లోపంగా మారుతుంది. ఈ లక్షణాలు ద్వారా ప్రోటీన్ లోపాన్ని తెలుసుకోవచ్చు. అలసట, పాదాల్లో వణుకు, అధికంగా జుట్టు రాలడం, పీరియడ్స్ క్రమం తప్పడం, చర్మ సమస్యలు, ఆహారం ఆలస్యంగా జీర్ణమడం, కండరాల బలహీనత, కాళ్ల నొప్పులు, గోళ్లు పెళుసుగా మారటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. రోగ నిరోధక శక్తి మెరుగ్గా ఉండాలంటే ప్రోటీన్ చాలా అవసరం.
శరీరంలోని యాంటీబాడిలు పెరిగేందుకు ప్రోటీన్లు సహాయపడతాయి. ఇవి తక్కువగా ఉండే ఆరోగ్య సమస్యలు వస్తాయి. కూరగాయలు, ఆకుకూరలు, బాదం, వాల్ నట్స్, పిస్తా, చేపలు, కోడిగుడ్లలో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. చియా సీడ్స్, పప్పు ధాన్యాలను తీసుకోవటం వల్ల శరీరానికి మేలు చేస్తాయి. కాబట్టి ప్రోటీన్ లోపం ఉన్నవారు ఈ విధమైన ఆహారాన్ని తీసుకోవడం మంచిది. ప్రోటీన్స్ ఉన్న ఆహారం తీసుకుంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది. రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఉపయోగపడుతుంది. బలంగా కూడా ఉంటాము. కాబట్టి డైలీ కోడి గుడ్డుని తప్పకుండా తినండి. ఇది తినటం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది. ప్రోటీన్లు ఉన్న ఫుడ్ ని ఎక్కువగా తీసుకోవటం మంచిది.