ఈ ఒక్క వేస్తే చాలు.. నెలసరి నొప్పులు ఫటా ఫట్ మాయం..!

frame ఈ ఒక్క వేస్తే చాలు.. నెలసరి నొప్పులు ఫటా ఫట్ మాయం..!

lakhmi saranya
యోగాసనాలు ఎక్కువగా చేయడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఆడవాళ్లు మగవాళ్ళు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఈ హాసనాలను వేయవచ్చు. ఆడవారిలో నెలసరి అనేది సాధారణమైన విషయమే. కానీ, ఈ నెలసరి సమయం అందరికీ ఒకేలా ఉండదు. చాలామందికి నెలసరి సమయంలో కొన్ని రకాల సమస్యలు ఏర్పడుతుంటాయి. కడుపులో విపరీతమైన నొప్పి, నడుము నొప్పి, బాడీ పెయిన్స్ వంటి సమస్యలు వస్తుంటాయి. ఈ నొప్పిని తగ్గించుకోవటానికి చాలామంది మెడిసిన్ వేసుకుంటారు. కానీ, పీరియడ్స్ సమయంలో పెయిన్ కిల్లర్స్ వాడటం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడం కోసం ఈ ఒక్క అసనం వేస్తే చాలు.
అదే ఉత్కట కోణాసనం. దీనిని నెలసరి సమయంలో మాత్రమే కాకుండా ప్రతిరోజు చేయటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఉత్తట కోణాసనం చెయ్యటం వల్ల పీరియడ్స్ లో వచ్చే సమస్యల నుంచి ఉపశ్రమణం లభిస్తుంది. మోనోపాజ్ నుంచి వచ్చే సమస్యలు తగ్గేందుకు ఉత్కట కోణాసనం సహాయపడుతుంది. ఈ ఆసనం వెయ్యటం వల్ల మానసిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఆందోళన, ఒత్తిడిని తగ్గించేందుకు ఇది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా అంతర్గత సామర్థ్యాన్ని పెంచి, ఏకాగ్రతను పెంచేందుకు సహాయపడుతుంది. శరీరంలో ప్రత్యుత్పత్తి అవయవ పనితీరును మెరుగుపరుస్తుంది.
ఈ ఆసనాన్ని గర్భిణీ స్త్రీలు చెయ్యటం వల్ల ప్రసవం సులభం అవుతుంది. కండరాలు దృఢంగా అవటం కోసం ఈ హాసనాన్ని వేయండి. ఈ ఆసనం ప్రతి రోజు చేయడం వల్ల తుంటి, తొడలతో సహా శరీరంలోని కింద భాగంలో కండరాలు దృఢంగా మారుతాయి. ఇది శరీరా శక్తిని మెరుగు పరచడంలో సహాయపడుతుంది. ఈ ఉత్కట కోణాసనం ను ప్రతిరోజు చేయటం వల్ల శరీర భాగాల్లో రక్త ప్రసన్న మెరుగ్గా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ముందుగా నిటారుగా నిల్చోవాలి. ఆ తర్వాత రెండు కాళ్ళను పక్కకు కొంత దూరం జరపాలి. ఆ తరువాత మోకాళ్ళను నుంచి, శరీరాన్ని కిందకు తీసుకురావాలి. అలా వీలైనంత వరకు మోకాళ్ళను వంచాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: