మీ పాదాలు అందంగా ఉండాలనుకుంటున్నారా?.. అయితే ఈ సింపుల్ టిప్స్ పాటించండి..!
దీనివల్ల పాదాలు అందంగా కనిపిస్తాయి. మొదటగా ఒక టబ్బులో గోరువెచ్చని నీరు తీసుకోవాలి. అందులో కొంచెం ఎప్సం సాల్ట్, ఒక విటమిన్-ఇ క్యాప్సిల్, కొన్ని చుక్కల రోజు వాటర్ ను వేసుకోవాలి. తరువాత కాసేపు పాదాలను అందులో ఉంచాలి. ఇలా 20 నిమిషాల పాటు ఉంచిన తరువాత బయటకు తీసి ఆరనిచ్చి, మాయిశ్చరైజర్ రాసుకోవాలి. దీనివల్ల పాదాలు అందంగా మృదువుగా మారుతాయి. పచ్చి పాలలో రెండు స్పూన్లు చక్కెర కలిపి పాదాలపై మర్దన చేయాలి. కాసేపటి తరువాత శుభ్రంగా కడిగి, పెట్రోలియం జెల్లి రాసుకోవాలి. ఇలా చేయటం వల్ల పాదాలు మృదువగా మారుతాయి. రెండు స్పూన్ల తేనెను తీసుకొని, అందులో ఒక స్పూన్ పసుపు కలిపి పాదాలకు రాయాలి.
ఇలా 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. తేనే పాదాలకు తేమను అందించి, మృదువుగా ఉండేలా చేస్తుంది. నాలుగు టేబుల్ స్పూన్లు ఎప్పమ్ సాల్ట్, మూడు టేబుల్ స్పూన్లు వైట్ వెనిగర్ ను గోరు వెచ్చని నీటిలో కలపాలి. ఆ నీటిలో పాదాలను 15 నిమిషాల పాటు ఉంచాలి. రాత్రి పడుకునే ముందే ఈ విధంగా చేయడం వల్ల కాలి పగుళ్లు తగ్గిపోతాయి. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు పాదాలకు మసాజ్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ప్రతిరోజు స్నానం చేసే సమయంలో పాదాలను మడమలను బ్రష్ లేదా ప్యూమిస్ స్టోన్ తో రుదువుగా రుద్దుకోవాలి.