ఈ టాబ్లెట్ ను అదిగా వాడుతున్నారా...? ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!

lakhmi saranya
ఈరోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా టాబ్లెట్స్ ని మరీ ఎక్కువగా వాడుతున్న సంగతి తెలిసిందే. టాబ్లెట్స్ ఎక్కువ వాడటం వల్ల అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మారుతున్న ఆహారపు అలవాట్లు అనేక రకాల ఆరోగ్య సమస్యలకు కారణం అవుతున్నాయి. ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే గుండె మంట, దీర్ఘకాలిక మలబద్ధకం, జీర్ణకోశ వంటి సమస్యలు వస్తాయి. అయితే, వీటిలో కొన్ని సమస్యలను రోజువారి ఆహారపు అలవాట్లు, వ్యాయామం వంటి వాటి ద్వారా తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి కొన్ని సమస్యలకు మందులు వాడితే సరిపోతుంది.
 కానీ, ఈరోజుల్లో చాలామంది చిన్న చిన్న సమస్యలకే పెయిన్ కిల్లర్స్ ను ఎక్కువగా వాడుతుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది ఈ పెయిన్ కిల్లర్ ను ఉపయోగిస్తున్నారు. ఇది ఎక్కువ తలనొప్పి, కండరాలు, దీర్ఘకాలిక నొప్పులను తగ్గించడంలో సహాయపడతాయి. అయితే, వీటిని ఎక్కువగా వాడటం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలో ఏ భాగంలో అయినా నొప్పిని తగ్గించడానికి పెయిన్ కిల్లర్ సహాయపడుతుంది. కానీ, వీటిని వైద్యుల సలహా లేకుండా ఉపయోగించడం మంచిది కాదు.
పెయిన్ కిల్లర్ ను అతిగా వాడితే, అల్సర్, అంతర్గత రక్తస్రావం జరిగే ప్రమాదం ఉంది. వీటిని ఎక్కువ కాలం వాడటం వల్ల కిడ్నీలు, కాలేయం సమస్యలను కలిగిస్తుంది. ఒక్కసారి ఇది ఫెయిల్యూర్ కు కారణం కావచ్చు. అంతేకాకుండా ఇవి శరీరంలోని అవయవాల మీద ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. పెయిన్ కిల్లర్స్ వేసుకోగానే నొప్పి తగ్గిన ఫీలింగ్ కలిగిన ... తరువాత మళ్లీ ఆ నొప్పి పెరిగే అవకాశం ఉంటుంది. వీటిని అదిగా ఉపయోగించటం వల్ల తరచుగా తలనొప్పి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ పెయిన్ కిల్లర్ ను 16 ఏళ్ల లోపు పిల్లలకు అస్సలు ఇవ్వకూడదు. ఒకవేళ డాక్టర్ సలహా లేకుండా వీటిని ఇచ్చినట్లయితే పిల్లల మెదడుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: