ఆఫీస్ టైమ్ లో తినాల్సిన హల్తి ఫుడ్స్ ఇవే!
మరికొందరు ఆఫీస్ వర్క్ చేసే ప్రదేశం లోనే కూర్చున్న చోటే భోజనం చేస్తుంటారు. అలా తినటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. శారీరక శ్రమ లేకపోవటంతో పాటుగా 8 లేదా 10 గంటల పాటు అలాగే కంప్యూటర్ల ముందు కూర్చుని, సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. ఇలాంటి వారు తప్పనిసరిగా ఆహ్వానం తీసుకునే విషయంలో జాగ్రత్తలు పాటించాలి. పనిలో పడి సరైన సమయానికి ఆహారం తినకపోతే గుండె జబ్బు, బిపి, షుగర్, నరాల బలహీనత వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాంటివారు ఆహార విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
ఎక్కువ సమయం ఆఫీసులో పనిచేసే వారు విరామ సమయంలో నట్స్, మొలకలు లేదా ఉడకబెట్టిన ధాన్యాలు వంటివి తినటం మంచిది. వీటిని తినటం వల్ల ఎక్కువ సమయం ఆకలి కాకుండా ఉంటుంది. ఆఫీస్ కు వెళ్లే వారు మధ్య మధ్యలో పండ్లు తీసుకోవటం మంచిది. దాక్ష, జామ,అరటి, కమల వంటి పండ్లను తినటం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. రోజంతా నీరసం రాకుండా, అలసిపోకుండా ఉండేందుకు ఇవి సహాయపడతాయి. ఒకే చోట కూర్చుని పని చేసే వారికి గ్రీన్ టీ ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే పాలిఫెనాల్స్ శరీరాన్ని ఆసలిపోకుండా చేస్తుంది. దీనిని అధిక మొత్తంలో కాకుండా రోజుకి రెండు లేదా మూడు కప్పులు తాగటం మంచిది.