'ఫస్ట్ నైట్' ఎందుకు నిద్ర పట్టదు.. దీని వెనక సైంటిఫిక్ రీజన్ కూడా ఉందా?
సాధారణంగా మనం కొత్త ప్రదేశాలకి వెళ్ళినప్పుడు, అక్కడ బస చేసే సమయంలో రాత్రిలో నిద్ర పట్టక నిద్రలేమి సమస్యలతో బాధపడుతూ ఉంటాము. ఇది మనకొక్కరికే కాదు, చాలామంది ఈ సమస్య వెంటాడుతుంది. ఏదైనా కొత్త ప్రదేశంలో నిద్ర పోవాలంటే మనసు సహకరించదు. అయితే దీనికి సైంటిఫిక్ రీసన్స్ కూడా ఉన్నాయి అంటున్నారు సైంటిస్టులు. కొత్త ప్రదేశంలో రెస్ట్ తీసుకుంటున్న పలువురు పైన అధ్యయనం చేసిన ఒక సర్వే ఈ ఫస్ట్ నైట్ ఎఫెక్ట్ గురించి రాసుకొచ్చింది.
మనకు తెలియని ఏదైనా కొత్త ప్రదేశంలో నిద్రిస్తున్నప్పుడు మనిషి మెదడులోని ఒక భాగం మాత్రమే రెస్ట్ తీసుకుంటుందట. ఈ విషయాన్ని బ్రౌన్ యూనివర్సిటీ పరిశోధకులు తాజాగా వెల్లడించారు. అలా చేసిన ఓ ప్రయోగంలో నిద్రిస్తున్న వారిలో కుడివైపు కంటే ఎడమవైపు భాగం ఎక్కువగా మేల్కొన్నట్టు కనుగొన్నారు. ఈ క్రమంలోనే కొత్త ప్రదేశంలో రెస్ట్ తీసుకున్నవారు ఎక్కువగా అలసటకు గురవుతున్నట్టు కనుగొన్నారు. దీనినే ఫస్ట్ నైట్ ఎఫెక్ట్ అని బ్రౌన్ యూనివర్సిటీ పరిశోధకులు చెప్పుకొచ్చారు. అయితే విచిత్రంగా కొంతమంది మాత్రం ఇలాంటి స్టేట్మెంట్లకు అతీతం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే వీరు ఎలాంటి కొత్త ప్రదేశంలో నిద్రపోయిన క్షణాల్లో నిద్రలోకి జారుకుంటారు. అయితే మీలో ఎవరైనా ఇలా కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఫస్ట్ నైట్ ఎఫెక్ట్ కి గురైనట్లయితే కింద కామెంట్ ల రూపంలో తెలియజేయండి.