అతి ధోరణులే అనర్ధాలు... ఈ రుగ్మతలను పెంచుతాయంటున్న నిపుణులు..!

lakhmi saranya
ఎక్కువగా ఆలోచించడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. నిద్ర లేకపోవడం కూడా అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అతి నిద్ర పనికి చేటు, అతి ఆలోచనలు అనారోగ్యానికి చేటు అంటుంటారు పెద్దలు. అంతేకాదు, ఈ రోజుల్లో అతి ధోరణులు, అతి స్పందనలు, అతి భావోద్వేగాలు కూడా అనర్ధాలకు దారి తీస్తున్నాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఏదైనా ఒక విషయంలో పట్ల అవగాహన కలిగి ఉండటం వేరు. అవగతం చేసుకోవటం వేరు. సందర్భాన్ని బట్టి స్పందించటం వేరు. కానీ వీటన్నిటికీ భిన్నమైనదే అతి ధోరణి. ఇది అతి భావోద్వేగాలకు దారితీసి ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
దాదాపు ఇది బోర్డర్ లైన్ పర్సనాలిటి డిజార్డర్ ఈ కోవాకు చెందినదే అంటున్నారు నిపుణులు. జీవితమన్నాక మంచి చెడు ఉంటాయి. సమస్యలు సవాళ్లూ ఎదురవుతుంటాయి. వాటిని మీరు ఎలా స్వీకరిస్తారు?, ఎలా స్పందిస్తారు? పరిష్కరించే విషయంలో ఎలా ఆలోచిస్తారు? అనే అంశాల పట్ల తగిన అవగాహన ఉన్నప్పుడు పెద్దగా భయం ఉండకపోవచ్చు. అది లేనప్పుడే అసలు సమస్య మొదలవుతుంది. అప్పుడు అతి ధోరణి, అతి భావోద్వేగం, అతి స్పందన వంటి హవ భావాలు, ప్రవర్తనలు కలిపిస్తుంటాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇవి చివరకు మీ పై ప్రతికూల ప్రభావం చూపుతాయి. అందుకే 'అతి' ఏ విషయంలోనూ మంచిది కాదంటారు నిపుణులు.
అంతసేపూ సరదాగా, సంతోషంగా ఉన్న ఒక వ్యక్తి... అకస్మాత్తుగా కొప్పడతారు. ఏదో తలుచుకుని వెక్కి వెక్కి ఏడుస్తారు. తాము అనుకున్నది జరగకపోతే చాలు. అది పెద్ద విషయం కాకపోయినా, నష్టం చెయ్యకపోయినా అతిగా ఆలోచిస్తారు. భావోద్వేగానికి లోనవుతారు. ఇక్కడే మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. కారణాలేమైనా అది భావోద్వేగాలు, బాధలు నీలో భిన్నమైన తనకు దారితీస్తాయి. చేసింది చెయ్యటం, చెప్పిందే చెప్పడం, ప్రతి విషయానికి అతిగా స్పందించటం వంటి బిహేవియర్ గల బొర్డర్ లైన్ పర్సనాలిటీకి దారి తీయవచ్చు ఆధ్యాయణాలు సైతం పేర్కొంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: