రెగ్యులర్గా ఈ పండు తినండి.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం...!
గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దీనిలో ఉండే విటమిన్లు, ఖనిజాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ హార్ట్ ను హెల్తీగా ఉంచుతాయి. కాగా ఆహారంలో అవకాడోను చేర్చుకోవడం మంచిది. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించటంలో మేలు చేస్తుంది. అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు ఈ పండు తింటే ప్రయోజనం చేకూరుతుంది. చెడు కొలెస్ట్రాల్ ధమనుల గోడల్లో ఫలకాన్ని నిక్షేపిస్తుంది. దీంతో బ్లడ్ సర్కులేషన్ తగ్గిపోతుంది. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది కాదు. అంతేకాకుండా నొప్పులు, వాపును తగ్గించడంలో, అధిక బరువు తగ్గించటంలోనూ అవకాడో పండు మేలు చేస్తుంది.
గర్భధారణలో కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పండు తింటే స్టమక్ ఎక్కువసేప నిండుగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది. దీంతో ఆకలిని నియంతరించి... వెయిట్ తగ్గించడంలో మేలు చేస్తుంది. అధిక పీచు, పోషకాలతో నిండిన అవకాడో ప్రెగ్నెన్సీ సమయంలో తింటే మంచిది పాలిచ్చే కొత్త తల్లులు కూడా ఈ పండు తీసుకుంటే మేలు. ఫోలేట్, విటమిన్ సి, పొటాషియం వంటివి అవకాడోలో పుష్కలంగా ఉంటాయి. డెలివరీ తర్వాత తల్లిపాలు ఉత్పత్తిని పెంచడంలో అవకాడో ఎంతో సహాయపడుతుంది. కాబట్టి అవకాడో ను డైలీ తినవచ్చు. ఇది తినటం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. షుగర్ పేషెంట్లు అవకాడోను డైలీ తినవచ్చు. డైలీ తినటం వల్ల మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది.