వయసుని బట్టి ఈరోజు ఈ పని చేయండి..!

lakhmi saranya
ఏజె బట్టి వాకింగ్ చేయడం చాలా అవసరం. చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు వాకింగ్ నేను చేయవచ్చు. వాకింగ్ చేయడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. మీరు హెల్తీగా, ఫిట్గా ఉండాలంటే డైలీ ఏదో ఒక వ్యాయామం తప్పక చేయాల్సిందే. దీనివల్ల శరీరంలో రక్తప్రసరణ మెరుగు పడుతుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. అయితే ఇవన్నీ జరగాలంటే కచ్చితంగా జిమ్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు. కేవలం నడక ద్వారా కూడా మెరుగైన ఆరోగ్యాన్ని పొందవచ్చు అంటున్నారు ఫిట్ నెస్ నిపుణులు.
అయితే రోజుకు ఎంతసేపు వాకింగ్ చేయాలి? ఏ వయసు వారు ఎన్ని గంటలు నడిస్తే ఆరోగ్యానికి మంచిది? ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం. మీరు 18 నుంచి 30 ఏండ్ల మధ్య వయసు వారైతే రోజు కనీసం 30 నిమిషాలు వాకింగ్ చేయాలంటున్నారు ఫిట్ నెస్ నిపుణులు. ఈ ఏజ్ లో ఎనర్జీ లెవెల్స్ కూడా బాగుంటాయి. కండరాలు అన్ని రకాలుగా సహకరిస్తాయి. కాబట్టి గంటకు తగ్గకుండా కూడా వాకింగ్ చేయవచ్చు. దీనివల్ల అధిక బరువు సమస్య రాకుండా ఉంటుంది. పైగా గుండె ఆరోగ్యానికి మంచిది. కొందరు వయస్సు పెరుగుతున్న కొద్ది ఫిజికల్ యాక్టివిటీస్ తగ్గిస్తుంటారు.
అలా చేయటం కరెక్ట్ కాదంటున్నారు నిపుణులు. ఇతర వ్యాయామాలు చేయకపోయినా... కనీసం వాకింగ్ మాత్రం కంటిన్యూ చేయాలంటున్నారు. అయితే 31 నుంచి 50 ఏండ్ల లోపు వయసు వారు రోజు కనీసం 30 నుంచి 45 నిమిషాలు నడి సైనే మంచిది. దీనివల్ల కండరాల బలహీనత రాకుండా ఉంటుంది. అధిక బరువు తగ్గుతారు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. 51 నుండి 65 ఏండ్ల లోపు వారికి వయసు రీత్యా ఇతర వ్యాయామాలు కష్టం కావచ్చు. అయినా వాకింగ్ చేయటం మాత్రం తప్పనిసరి అంటున్నారు ఫిట్ నెస్ నిపుణులు. రోజు కనీసం 30 నిమిషాల నడక ఈ ఏజ్ లో ఎంతో మేలు చేస్తుంది. బోన్స్ దృఢంగా, ఆరోగ్యంగా ఉండటంలో సహాయపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: