డయాబెటిస్ని కంట్రోల్ చేయడానికి మందులే కావాలా ఏంటి?.. ఈ విధంగా కూడా మాయం చేయవచ్చు..!
ఇవ్వరాలేమిటో ఇప్పుడు చూద్దాం. టైప్ 2 డయాబెటిస్ ఉన్నప్పుడు బ్లడ్ లో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. వీటిని అదుపులో ఉంచడానికి బాధితులు సహజంగానే మెడిసిన్ వాడాల్సి ఉంటుంది. కానీ అలాంటి అవసరం లేకుండా ఆహారంలో మార్పులు చేసుకుంటే కూడా ఈ డయాబెటిస్ ను నియంత్రణలో ఉంచుకోవచ్చునని పరిశోధకులు అంటున్నారు. ముఖ్యంగా లో కార్బ్ డేట్ తీసుకుంటే ఈ డయాబెటిస్ బాధితుల్లో శరీరంలో ' బీటా సెల్ ' పనితీరులు గణనీయమైన మార్పులు వస్తాయని, తద్వారా మధుమేహం నియంత్రణలో ఉండడాన్ని రిసెర్చర్స్ గుర్తించారు. అధ్యాయనంలో భాగంగా పరిశోధకులు 35 నుంచి 65 ఏండ్ల లోపు వయసు గల అనేక మంది ఆహారపు అలవాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు టైప్ 2 డయాబెటిస్ బాధితుల్లో లో కార్బ డైట్ ఎక్కువ కాలం మెయింటైన్ చేసిన వారి ప్యాంక్రియాస్ లోని బీటా కణాలు ఇన్సులిన్ ను ఉత్పత్తి చేయడం వల్ల, రక్తంలోని చక్కెర స్థాయిలను నియంతరిస్తున్నట్లు గుర్తించారు. కాబట్టి కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే పాస్తా, వైట్ బ్రెడ్, షుగరింగ్ డ్రింక్స్, జంక్ ఫుడ్స్ వంటివి అవాయిడ్ చెయ్యాలని చెబుతున్నారు. బదులుగా ఆకుకూరలు, బ్రోకలి, నట్స్, తాజా కూరగాయలు వంటి ఫైబర్ పుష్కలంగా ఉండే లో కార్బ్ ఫుడ్స్ ఆహారంలో భాగంగా తీసుకోవటం మంచిదని సూచిస్తున్నారు. అలాగే చేపలు, గుడ్లు, మాంసం, హెల్త్ ఫ్యాట్స్ వంటి తక్కువ కార్బోహైడ్రేట్లు కలిగిన ఆహారాలు కూడా మేలు చేస్తాయి.