నువ్వులు తింటే ఆరోగ్యానికి ఇన్ని ప్రయోజనాల..!

lakhmi saranya
నువ్వులు ఆరోగ్యానికి చాలా మంచిది. నువ్వుల్లో ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. చాలామంది నువ్వులను ఇష్టంగా తింటారు. కొంతమందికి మాత్రం అస్సలు నచ్చదు. మనలో చాలామంది నువ్వులను ఇష్టంగా తింటారు. కొందరైతే నువ్వులు, బెల్లంతో చేసిన లడ్డూలను అదే పనిగా తింటూ ఉంటారు. ఇవి చలికాలంలో సూపర్ ఫుడ్. ఎందుకంటే, ఇది తినడానికి ఎంత రుచిగా ఉంటాయో అలాగే ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ప్రోటీన్లు, విటమిన్లు, ఒమేగా 6 వంటి పోషకాలు ఉంటాయి. అంతేకాకుండా, ఐరన్, మెగ్నీషియం కూడా ఉంటాయి. ఇవి ఎక్కువ వేడిని కలిగి ఉంటాయి. కాబట్టి, శీతాకాలంలో వీటిని తీసుకుంటే శరీరం వేడిగా ఉంటుంది.
 నువ్వులు రోజు తినటం వలన మన శరీరానికి కావాల్సిన ఖనిజాలు అందుతాయి. హైపర్టెన్షన్ తో ఇబ్బంది పడే వారికి నువ్వులు ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే, కాల్షియం ఉండటం వల్ల ఎముకలు బలంగా అయ్యేలా చేస్తాయి. నువ్వులలో మెగ్నీషియం, మాంగనీస్, కాల్షియం, జింక్ ఉంటుంది. ఎముకలు దృఢంగా ఉండేందుకు ఇవి చాలా అవసరం. అంతేకాకుండా, ఇవి కడుపులో మంటను తొలగిస్తాయి. వీటిని తినటం వలన కీళ్ల నొప్పులు నుంచి ఉపశ్రమణం పొందుతారు. అలాగే వీటిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. దీన్ని తీసుకోవటం వల్ల మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యల నుంచి ఉపశ్రమణం లభిస్తుంది. కాబట్టి డైలీ నువ్వులుని తినడం ఆరోగ్యానికి చాలా అవసరం. కర్రీస్ లో కూడా నువ్వులనే ఎక్కువగా వాడుతుంటారు కొందరు.
నువ్వులు ఏ విధంగా తిన్నా పర్వాలేదు కానీ తప్పకుండా తినండి. ఇందులో ఎన్నో పోషకాలు నిండి ఉంటుంది. చాలామంది నువ్వులను కడిగి నువ్వుల నూనెను చేసే దానినే ఎక్కువగా వాడతారు. ఎందుకంటే నువ్వుల నూనె చాలా మంచిది. ఆరోగ్యానికి కూడా చాలా అవసరం ఈ నూనె. కాబట్టి అందరూ కూడా తప్పకుండా నువ్వులనే తినండి. కొంతమంది పీరియడ్స్ ముందు నువ్వులు తింటే పీరియడ్స్ వచ్చేస్తాయని కంగారు పడిపోతారు. అలాంటి వారు మరి ఎక్కువగా కాకుండా తక్కువ తినవచ్చు. ప్రెగ్నెన్సీ తో ఉన్నవారు నువ్వులనే ఎందుకు తినొద్దంటారో తెలుసా? ప్రెగ్నెన్సీలో వేడి వస్తువులు తినటం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయని అంటారు. నువ్వులు తింటే బాగా వేడి చేస్తుంది కాబట్టి నువ్వులను తినవద్దు అంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: