రాజస్థాన్ టూర్ ఎలా ఉంటుందో తెలుసా? అయితే తప్పకుండా చూడాల్సిందే..!

lakhmi saranya
రాజస్థాన్ టూర్ కి ఎప్పుడైనా వెళ్లారా. ప్రకృతిని ఆస్వాదించాలంటే రాజస్థాన్ టూర్ కి తప్పకుండా వెళ్లాల్సిందే. ప్రకృతిలోకి ప్రయాణం భలే మజాగా ఉంటుంది. అడవులు, కొండలు, కోనలు, నదులు, జలపాతాలు, హిమాలయాలు, సముద్రాలు అన్ని చుట్టేసాను. ఎడారి ఒకటే మిగిలింది ఈ ప్రయాణానికి ఎడారి కేంద్రంగా రూపొందించుకున్నాము. అందుకే రాజస్థాన్ బయలుదేరాము. ఆరుగురు మహిళలం... అందులో ముగ్గురు రచయితలు. ఇద్దరు 65 ఏళ్ల పైబడిన వారు. మరో ఇద్దరు 60 ఏళ్ల పైబడిన వారు. ఒకరు యాభై ఏళ్ళు దాటిన వారు.
పెద్దవాళ్ళు కావటం వల్ల ఐదు రోజుల టూర్కు మాత్రమే ప్రణాళిక సిద్ధం చేసుకున్నాము. హైదరాబాద్ లో ఉదయం 4.45 కు విమానమెక్కి 7.45 కంతా జైపూర్ లో దిగిపోయాము. అప్పటికే మయూర్ ట్రావెల్స్ వాళ్లు ఏర్పాటు చేసిన వాహనం మా కొరకు సిద్ధంగా ఉంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా నగర పట్నాలకు బయలుదేరాము. జైపూర్ ను పింక్ సిటీ అంటారు కదా... అలా కనిపించడం లేదు ఎందుకు? అని అడిగాను డ్రైవర్ ని. ఆ ప్రాంతం కొత్తగా అభివృద్ధి చెందిందని, పాత జైపూర్ అంతా గులాబీ రంగులో ఉంటుందని చెప్పాడు. అప్పుడప్పుడే తెరుస్తున్న ఒక హోటల్లో వేడి వేడి పరోటాలు చేయించుకుని తిని, నగర పర్యాటన మొదలు పెట్టాము. అలా వెళ్తుంటే గులాబీ రంగు భవనాలు రోడ్డుకు ఇరువైపులా కనువిందు చేశాయి. జైపూర్ రాజస్థాన్ రాష్ట్రానికి రాజధాని. పెద్ద నగరం.
రాజస్థాన్ నగరం. రాజ్ పుత్ పాలకుడు రెండో సవాయ్ జైసింగ్ అమెర్ ఆ నగరాన్ని స్థాపించాడు. అతడు 1699 నుంచి 1743 వరకు పరిపాలించాడు. అతని పేరు మీద ఆ నగరానికి జైపూర్ అనే పేరు వచ్చిందట. యునెస్కా 2019 లో ఆ నగరాన్ని వారసత్వ సంపదగా గుర్తించారట. ముందుగా మేము అమెర్ కోటకు బయలుదేరాము. దానిని అంబర్ కోట అని కూడా పిలుస్తారు. అల్లంత దూరంగా కోట, దీని చుట్టూ ప్రహరిగోడ కనిపించాయి. పన్నెండు కిలోమీటర్లు పొడుగుతో ఆ గోడ దేశంలో రెండో స్థానంలో ఉందని గైడ్ చెప్పాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: