పిరియడ్స్ లో 1 రోజు మాత్రమే రక్తస్రావం అవుతుందా...? ఇది తప్పక తెలుసుకోవాల్సిందే!
సాధారణంగా ఇది మూడు నుండి 5 రోజుల వరకు ఉంటుంది. కొందరికి ఈ ఏడు రోజుల వరకు రక్తస్రామం అవుతుంది. ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే పీరియడ్స్ రావడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎక్కువగా ఒత్తిడికి గురయ్యే మహిళలకు ఇలా ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే రక్తస్రావం అవుతుంది. ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల పీరియడ్స్ ఆగిపోతుంది. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. ఒత్తిడి అనేది ప్రోజెస్టెరాన్, ఈస్ట్రోజన్ హార్మోన్లు పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇది మాత్రమే కాకుండా కఠినంగా వ్యాయామం చేసే మహిళలతో కూడా పీరియడ్ తక్కువ రోజులు మాత్రమే ఉంటుంది. ఇలా కఠిన వ్యాయామం చేయటం వల్ల అండోత్సర్గాన్ని నియంత్రించే హార్మోన్లు విడుదలను అడ్డుకునే అవకాశం ఉంటుంది.
అంతేకాకుండా థైరాయిడ్, పిసిఓఎప్, గర్భశయ సమస్యలు ఉన్న మహిళలకు కూడా ఇలా ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే రక్తస్రావం అవుతుంది. ఇలా జరిగే వారి శరీరంలో ఈస్ట్రోజన్ ఉత్పత్తి సరిగ్గా జరగదు. ఈ స్టేషన్ అనేది గర్భాశయంలో ఏండోమెంట్రియం అని పరాణం నిర్మించడంలో సహాయపడుతుంది. ఈ పొర రక్తస్రావం సజావుగా జరిగేలా చేస్తుంది. ఎప్పుడైతే ఈ పొర పలుచగా మారుతుందో అప్పుడు ఒకటి, రెండు రోజులు మాత్రమే రక్తస్రావం అవుతుంది. ఇలా జరుగుతున్నట్లయితే తప్పనిసరిగా వైద్యులను సంప్రదించడం మంచిది.