వాషింగ్ మెషిన్ లో వీటిని అస్సలు ఉతకకూడదు...!

lakhmi saranya
సంవత్సరాలు మారుతున్న కొద్ది టెక్నాలజీ ఇంకా పెరిగిపోతుంది. ఈరోజుల్లో బట్టలు చేత్తో ఉతికేవారు ఎవరైనా ఉన్నారా. ప్రతి ఒక్కరికి వాషింగ్ మిషన్ తప్పకుండా ఉంటుంది. ప్రతి ఒక్కరూ వాషింగ్ మిషన్ లోనే బట్టలని వేస్తారు. చేతితో ఉతికే వారు చాలా తక్కువ మందే ఉన్నారు. ఈరోజుల్లో ప్రతి ఒక్కరూ వాషింగ్ మెషన్ ను ఉపయోగిస్తున్నారు. ఇవి వచ్చిన తరువాత బట్టలు ఉతకటం నిమిషాల్లో అయిపోతుంది. అయితే, చాలామంది ఈ మెషన్ వాడేటప్పుడు కొన్ని తప్పులు చేస్తుంటారు.
 వాటి వల్ల బట్టలు పాడైపోతాయి. అందులో అన్ని రకాల దుస్తులను కలిపి ఉతికేస్తుంటారు. ఇలా చేయటం వల్ల బట్టల నాణ్యత, రంగు త్వరగా దెబ్బతింటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. సిల్క్ దుస్తులు చాలా సున్నితంగా ఉంటాయి. చాలామంది మామూలు బట్టలతోపాటుగా ఈ సిల్క్ దుస్తులను కూడా వాషింగ్ మెషన్ లో వేస్తుంటారు. ఈ మెషన్ ప్రాసెస్ చాలా వేగంగా ఉంటుంది. దీనివల్ల సిల్క్ దుస్తుల మెరుపు, నాణ్యత తగ్గిపోతుంది. వీటిని వాషింగ్ మెషిన్ లో పీయటం కంటే చేతితో ఉతకడం ఉత్తమం.
సున్నితంగా ఖరీదైన లో దుస్తులను వాషింగ్ మెషిన్ లో వేసి ఉతకకూడదు. ముఖ్యంగా ప్యాడ్లు ఉన్న బ్రాలను మెషన్ లో వెయ్యకూడదు. ఎందుకంటే మెషన్ లో వెయ్యటం వల్ల బ్రాల ప్యాడ్లు చిరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉన్ని దుస్తులను ఎప్పుడూ వాషింగ్ మెషన్ లో వెయ్యకూడదు. ఉన్ని చాలా మృదువుగా ఉంటుంది. ఈ దుస్తులను మెషన్ లో వెయ్యటం వల్ల తొందరగా పాడైపోతాయి. స్టడ్స్, ఫ్రిల్స్ దుస్తులను అస్సలు వాషింగ్ మెషన్ లో వేయకూడదు. ఒక వేళ వాషింగ్ మెషిన్ లో వీటిని వేసై, వీటి బటన్లు లేదా చైన్లు మెషిన్ లో ఇరుక్కునే అవకాశం ఉంది. దిని వల్ల మెషిన్ పాడైపోతుంది. ఇలా చేయటం వల్ల బట్టల నాణ్యత, రంగు త్వరగా దెబ్బతింటాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: