శీతాకాలంలో గుండె ఆరోగ్యంగా ఉండాలా...? ఈ రెడ్ ఫుడ్స్ తినండి చాలు!
శరీరానికి తగినం రక్తం సరఫరా చేసేందుకు, శరీరం లోపల మెచ్చగా ఉండటంలో గుండె పని ఎక్కువగా ఉంటుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువైతే రక్తనాళాలు మూసుకుపోయి గుండె, మెదడుకు వెళ్లే ధమనులను అడ్డుకుంటుంది. దీనివల్ల హార్ట్ ఎటాక్ వస్తుంది. ఇతర సీజన్లతో పోలిస్తే చలికాలంలో గుండెపోటు రెటు 53 శాతానికి పెరిగిందని బ్రిటిష్ హార్ట్ పౌండేషన్ చేసిన ఆధ్యాయనంలో తేలింది. చల్లటి వాతావరణం గుండెకు ప్రమాదమని నిపుణులు తెలిపారు. ఇలాంటి సమస్యలు రాకుండా గుండె ఆరోగ్యంగా ఉండాలంటే రెడ్ ఫుడ్ ను తీసుకోవటం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. దానిమ్మ పండులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ధమనుల్లో బ్లాక్స్ ను నిరోధించడంలో సహాయపడుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రక్తపోటును నియంతరించడంలో ఉపయోగపడుతుంది. క్రాన్ బెర్రిస్ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇందులో ఎన్నో సూక్ష్మపోషకాలు అధికంగా ఉంటాయి. ఇది యాంటీ ఆక్సిడెంట్, శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి. వీటిని తినడం వల్ల చెడు కొలెస్ట్రాలను తగ్గించుకోవచ్చు. రెడ్ యాపిల్ లో ఉండే ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు 2 యూపిల్స్ తినటం వల్ల కొలెస్ట్రాల్ శాతం 50 శాతం వరకు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.