సబ్బు నురగతో పుట్టబోయే బిడ్డ ఆడ, మగ అనేది తెలుస్తుందా..?

lakhmi saranya
ఈరోజుల్లో పుట్టబోయే బిడ్డ ఆడ మగ అని ఏ డాక్టర్లు చెప్పటం లేదు. డాక్టర్లు చెప్పటం వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. ఒకవేళ డాక్టర్లు చెబితే వెంటనే పోలీసులు వస్తారు. అందుకని భయపడి చెప్పటం లేదు. గర్భం దాల్చిన తర్వాత పొట్టబోయే బిడ్డ మగ పిల్లాడా లేదా ఆడపిల్లా అనే విషయం తెలుసుకోవాలని కోరిక చాలా మంది తల్లిదండ్రులకు ఉంటుంది. పుట్టబోయే బిడ్డ పై తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. దీనికోసం చాలా మంది ఇంటి చిట్కాలను పాటిస్తుంటారు. ఒకప్పుడు పుట్టబోయేది ఏ బిడ్డ అనేది తెలుసుకునేవారు. కానీ, కొందరు ఆడపిల్ల పుడుతుందంటే గర్భస్రావం చేయించుకునే వారు ఉన్నారు. దీని కారణం గానే లింగ నిర్ధారణ పై నిషేధం విధించింది.
ఇక, అప్పటినుంచి పొట్టబోయే బిడ్డ ఎవరనేది రకరకాల చిట్కాల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాటిలో ఒకటి ఈ సబ్బు నురగతో చేసే ప్రయోగం. ఈ మధ్యకాలంలో యూట్యూబ్ లో ఈ సబ్బు నురగ ప్రయోగం వైరల్ అవుతుంది. ఇందులో గర్భం దాల్చిన స్త్రీ మూత్రాన్ని సేకరించి, దానిని ప్లాస్టిక్ గ్లాస్ లో ఉంచుతారు. అందులో సబ్బు ముక్క వేసి కలుపుతారు. 30 నిమిషాల పాటు దాన్ని అలాగే వదిలేస్తారు. అందులో సబ్బు కరిగి నురగలాగా అనిపిస్తే మగ బిడ్డ అని, కరగకుండా అలాగే మొక్క ఉంటే ఆడపిల్ల పుడుతుందని చెబుతున్నారు. అయితే, చాలా చోట్ల ఇటువంటి పద్ధతి ద్వారా పరీక్షించుకునే వారు కూడా ఉన్నారు. అసలు ఈ సబ్బు నురగ ద్వారా ఎవరు పుడతారు తెలుస్తుందా...?
 అసలు ఇది ఎంతవరకు నిజమో నిపుణులు తెలియజేశారు. పుట్టబోయేది ఏ బిడ్డ అనేది కేవలం వైద్యులకు మాత్రమే తెలుస్తుంది. అల్ట్రా సౌండ్ స్కాన్ ద్వారా బిడ్డ జననాంగాల ఆకారాన్ని బట్టి ఎవరు పుడతారో వైద్యులు మాత్రమే తెలుసుకుంటారు. అయినా ఆ విషయాన్ని వారు  బయటపెట్టరు. సాధారణంగా స్త్రీ మూత్రాన్ని బట్టి లింగ నిర్ధారణను వైద్యులు కూడా చేయలేరు. ఇలా కేవలం రక్త పరీక్ష లేదా అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారానే తెలుస్తుంది. అయితే, ఏ బిడ్డ పుడుతుందా అనే విషయంపై చాలామంది ఇంటి చిట్కాలతో పరీక్షలు చేసి తెలుసుకుంటున్నారు. కానీ, నిజానికి ఇలా ఎప్పుడు తెలియదు. సబ్బు మూత్రంతో లింగ నిర్ధారణ పరీక్షకు పనికిరావని, ఇది కేవలం వారి అపోహ మాత్రమే అని నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: