పోషకాలు పోకుండా ఇలా వండేయండి...!

lakhmi saranya
ఆరోగ్యంగా ఉండాలంటే గ్రీన్ విజిటేబుల్స్ తప్పకుండా తీసుకోవాలి. గ్రీన్ వెజిటేబుల్స్ ఎక్కువగా తినటం వల్ల మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఆకుకూరలు, ఆకుపచ్చటి కూరగాయలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిని డైలీ తినటం వల్ల ఎలాంటి సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు. వీటిల్లో కొవ్వు పదార్థాలు, ప్రోటీన్లు, ఖనిజ లవణాలు ఎక్కువగా ఉంటాయి. కంటి ఆరోగ్యానికి, రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు చర్మ ఆరోగ్యానికి కూడా ఇవి ఉపయోగపడతాయి. అయితే, ఈ పోషకాలు ఉన్న ఆకు పచ్చడి కూరగాయలు వండేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే అందులో ఉండే ప్రోటీన్లు పూర్తిగా శరీరానికి అందుతాయని నిపుణులు చెబుతున్నారు.
అవేంటో ఇప్పుడు చూద్దాం. నాకు పచ్చటి కూరగాయలు అంటే బ్రకోలి, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బచ్చలి కూర, తోటకూర, కొత్తిమీర, పాలకూర వంటి మొదలైనవి ఆకు పచ్చటి కూరగాయల కిందకి వస్తాయి. అయితే, వీటిని వండేటప్పుడు కొంత సమయం వరకు వేడి నీళ్లలో ఉంచిన తరువాత కూర వండితే వంట త్వరగా అవుతుంది. ఇది మాత్రమే కాకుండా.. కూరగాయలు వేడి చేసిన నీళ్లను అదే కూరలు ఉపయోగించటం వల్ల వాటిలోని పోషకాలు బయటకి పోకుండా ఉంటాయి. నాకు పచ్చటి కూరగాయలను వండేటప్పుడు కొంచెం వెన్న లేదా ఆలివ్ ఆయిల్ ఉపయోగించి వాడటం వల్ల అందులో ఉండే పోషకాలు తగ్గిపోకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
 వీటిని వండే క్రమంలో ఉప్పు, మిరియాల పొడి, అల్లం, వెల్లుల్లి పేస్ట్ వంటివి ఉపయోగిస్తే కూర రుచిగా ఉండటమే కాకుండా అందులోనే పోషకాలు శరీరానికి అందుతాయి. ఎప్పుడూ కూడా ఆకు పచ్చటి కూరగాయలను వండేటప్పుడు అందులో కొంచెం నీటిని ఉపయోగించాలి. కొంతమంది కూరని గ్రేవీ లేకుండా అలాగే వండేస్తుంటారు. ఇలా చెయ్యటం వల్ల వాటి రంగు మారిపోయి, పోషకాలు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అందుకే ఆకుపచ్చటి కూరగాయలను వండేటప్పుడు కొద్దిగా నీళ్లను కూరలో ఉపయోగించాలి. చాలామంది కూర చల్లారిపోయిందని వేడి చేసుకుని తింటుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: