వెయ్యేళ్లనాటి కోట... చెక్కుచెదరని బురుజులు!
దీనిని అంబర్ కోట అని కూడా పిలుస్తారు. అల్లంతా దూరంగా కోట, దీని చుట్టూ ప్రహరిగోడ కనిపించాయి. జైపూర్ లో అమెర్ మహాలుగా వెళ్ళాము. ప్రవేశరుసుము ఒకరికి రూ. 152లు. అమెర్ మహల్ రాజ్ పుత్ , మొఘల్ వాస్తు నిర్మాణ శైలిలో ఉంది. దీని నిర్మాణం ఒకేసారి జరుగలేదట. నాలుగు స్థాయిలలో జరిగిందని గైడ్ చెప్పాడు. దివాన్ - ఏ - ఖాస్, షిష్ మహల్, సుఖ్ నివాస్ మొదలైన విభాగాలున్నాయి. గొడలపైన, పై కప్పులో బంగారం, నీలం, పచ్చల సహజ రంగుల తో చేసిన చిత్రీకళ ఆనాటి రోజుల వైభవానికి తాత్కణం. విండ్ మహల్ లోపలకి మరమ్మత్తుల కారణంగా తాత్కాలికంగా అనుమతి లేదు.
ఆ రోజుల్లోనే నేటి క్యాసెట్ మిదుగా వీచే గాలుల ద్వారా చల్లని వాతావరణ ఏర్పడే విధంగా నిర్మించడం నాటి సంకేతికతకు నిదర్శనం. రాజ్ మాన్ సింగ్ కు 12 మంది భార్యలు. అందరికీ విడివిడిగా గదులున్నాయి. పొట్టపు రాణి గది అద్దాలతో ప్రత్యేకంగా ఉన్నది. లోపలి నుంచి 2.5 కి.మీల సొరంగా మార్గం గుండా జైఘర్ కోటకు చేరుకోవచ్చు. జైపూర్ లో ఏనుగు సవారి ప్రత్యేక. ఒకరికి రూ. 1800 చెల్లించి ఏనుగు సవారిని ఎంజాయ్ చేసాము. ప్రశాంతమైన వాతావరణంలో పచ్చని చెట్ల మధ్య ఏనుగు మీద కూర్చుని వెళుతుంటే ఆ గజగమనానికి అనుగుణంగా మనస్సు కూడా అడుగులు వేసింది.