ఈ వయసులో గర్భధారణ సేఫ్ కాదు! అంటున్న నిపుణులు !

lakhmi saranya
వయసు చిన్నగా ఉన్నప్పుడు గర్భం రావడం అంత మంచిది కాదు. ఈరోజుల్లో పిల్లలను కనటం లో చాలా ఆలస్యం చేస్తున్నారు. ఇలా ఆలస్యం చేయటం వల్ల కూడా అంత మంచిది కాదు. ప్రపంచవ్యాప్తంగా చాలామంది మహిళలు పిల్లల్ని కనే విషయంలో ఆలస్యం చేస్తున్నారు. విద్యా, కెరియర్ పై శ్రద్ధ చూపిస్తూ.. అన్ని విధాలుగా స్థిరపడిన తరువాతే వివాహం, పిల్లల్ని ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే వారి వయసు పెరుగుతోంది. సాధారణంగా కొంత వయసు దాటిన స్త్రీలు బిడ్డ నువ్వు కనడంలో ఎన్నో కారణాల సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
మరి కొందరికి ఆరోగ్య పరమైన సమస్యల కారణంగా ప్రెగ్నెన్సీ ఆలస్యం అవుతుంది. ఇలా కారణాలు ఏవైనా ఆలస్యంగా గర్వం ధరించడం వల్ల స్త్రీల ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం చూపుతోందని నిపుణులు చెబుతున్నారు. 35-40 ఏళ్ల తర్వాత గర్భధారణతో డెలివరీ సమయంలో ఆరోగ్య సమస్యలు దారితీస్తుంది. అంతేకాకుండా 35 ఏళ్ల తర్వాత మహిళల్లో సంతానానికి దోహదం చేసే అండాల పరిమాణం, నాణ్యత తగ్గుతుంది. దీనికి తోడు జన్యుపరమైన లోపాలు తలెత్తుతున్నాయి. ఈ వయసు దాటాక వచ్చే ప్రెగ్నెన్సీ తల్లి, బిడ్డ ఇద్దరికీ అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మహిళల వయసు పెరిగే కొద్ది ఎండో మెట్రియోసిస్, యుటెరైన్ ఫైబ్రాయిడ్స్ సమస్యలు పెరుగుతాయి.
కాబట్టి లేట్ ప్రెగ్నెన్సీ సేఫ్ కాదు. దాదాపుగా 30 శాతం మంది మహిళలలో ఈ సెట్ ఎఫెక్ట్ తక్కువగా ఉంటుంది.కానీ, 70 శాతం మంది స్త్రీలలో ప్రెగ్నెన్సీ టైంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇప్పుడు నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరంలోని ఇతర వ్యవస్థలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. గర్భధారణ సమయంలో చాలా మంది మహిళలకు డయాబెటిస్ వచ్చి, డెలివరీ తరువాత తగ్గిపోతూ ఉంటుంది. ఈ పరిస్థితిని గెస్టేషనల్ డయాబెటిస్ అంటారు. అయితే 40 ఏళ్లు దాటిన వారిలోనే ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ప్రి ఎక్లాంప్సియా, గెస్టేషవల్ డయాబెటిస్, గెస్టేషనల్ హైపర్ టెన్షన్ లైట్ వయస్సు ప్రెగ్నెన్సీలో వస్తే అలాగే కొనసాగే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: