స్కిప్పింగ్ ఒక్కటి చేస్తే ఎన్ని లాభాలు తెలుసా...?

lakhmi saranya
స్కిప్పింగ్ చేయటం ఆరోగ్యానికి చాలా మంచిది. స్కిప్పింగ్ చేయటం వల్ల బరువు తగ్గే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చిన్నవాళ్ల దగ్గర నుంచి పెద్దవాళ్లు వరకు కూడా ఈ స్కిప్పింగ్ నీ చెయ్యవచ్చు. స్కిప్పింగ్ అంటే చాలామంది చిన్న పిల్లలు ఆడే ఆటని అనుకుంటారు. కానీ, ఇదొక బాడీ వర్కౌట్. స్కిప్పింగ్ చాలా ప్రభావవంతమైన వ్యాయామం. చాలామంది బరువు తగ్గాలనే ఉద్దేశంతో కష్టమైన వ్యాయామం, ఆహారపు అలవాట్లను మార్చుకుంటుంటారు.
పొట్ట తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు, వర్కౌట్స్ చేస్తుంటారు. ఇలా కాకుండా తేలికగా 15 నిమిషాల పాటు ఈ స్కిప్పింగ్ చేయటం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చాలానే ఉంటాయి ఫిట్ నెస్ నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. స్కిప్పింగ్ చేయటం వల్ల శరీరంలోని జీవక్రియ మెరుగ్గా ఉంటుంది. దీనివల్ల క్యాలరీలు బర్రి అవుతాయి. భుజాలు, పొట్ట చుట్టూ ఉండే కొవ్వుతో పాటు శరీరంలోని కండరాల చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరిగించేందుకు ఇది ఉపయోగపడుతుంది. ప్రతిరోజు స్కిప్పింగ్ చేయటం వల్ల గుండె వేగం పెరుగుతుంది. దీనివల్ల హార్ట్ కి ఆక్సిజన్ మెరుగ్గా అందుతుంది.
 హృదయ కండరాలకు, ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తుంది. శరీరంలోని అన్ని భాగాలకు రక్తం, ఆక్సిజన్, పోషకాల సరఫరా బాగా జరుగుతుంది. స్కిప్పింగ్ డైలీ చెయ్యటం వల్ల గుండె వ్యాధులకు చెక్ పెట్టొచ్చు. స్కిప్పింగ్ చేయటం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. స్కిప్పింగ్ చేసే సమయంలో ఏకాగ్రత మొత్తం తాడు తగలకుండా చెయ్యాలని ఆలోచనతో ఉంటారు. దీనివల్ల జ్ఞాపకశక్తి పెరుగు పడుతుంది. స్కిప్పింగ్ ప్రతిరోజు చేయటం వల్ల కాళ్లు, చేతులు, తొడ వంటి ఇతర భాగాల్లో కండరాలు దృఢంగా మారుతాయి. శరీరంలోని క్యారీలు ఎక్కువగా ఖర్చవుతాయి. దీనివల్ల బాడీ ఫిట్ గా ఉంటుంది. ఇలా కాకుండా తేలికగా 15 నిమిషాల పాటు ఈ స్కిప్పింగ్ చేయటం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చాలానే ఉంటాయి ఫిట్ నెస్ నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: