డయాబెటిస్ ఉన్నా వైట్ రైస్ తినొచ్చు..! షుగర్ లెవెల్స్ కూడా పెరగావ్!
కానీ అలాంటి భయం అవసరం లేదంటున్నారు నిపుణులు. ఎందుకంటే ' ఆసియా పసిఫిక్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్' లో పబ్లిషైన అధ్యాయనం ప్రకారం... అన్నం తిన్న షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం లేదు. అదెలా సాధ్యమో ఎప్పుడు చూద్దాం. బంగాళదుంపలు, తెల్ల బియ్యం లో, వండిన అన్నం లో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తినడం వల్ల షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. అయితే వండినా తరువాత పూర్తిగా చల్లారాక తినటం వల్ల ఎలాంటి నష్టం లేదని తాజా ఆధ్యయనం రుజువు చేసింది. ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల చల్లగా మారినా అన్నంలో గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గుతాయని, దానిని తిన్న షుగర్ లెవెల్స్ పెరగవని పరిశోధకులు అంటున్నారు.
ఆధ్యాయంలో భాగంగా రీసెర్చ్ ర్స్ టైప్ 1 డయాబెటిస్ ఉన్న 32 మంది రోగులకు వేర్వేరు భోజనాలు ఇవ్వడం ద్వారా ఫలితాలను పరిశీలించారు. షుగర్ బాధితుల్లో కొందరికి తాజాగా వండిన వైట్ రైస్ ఇవ్వగా, మరి కొందరికి వండిన తరువాత 24 గంటలపాటు ఫ్రిజ్ లో పెట్టి, ఆ తరువాత చల్లబడిన అన్నాన్ని వేడి చేసి ఇచ్చారు. పరిశోధకులు. కాగా చల్లబడిన అన్నం తిన్నవారిలో చక్కెర స్థాయిలో కంట్రోల్లో ఉన్నట్లు ఈ సందర్భంగా గుర్తించారు. చల్లబడిన తరువాత అన్నంలో గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గటం వల్ల ఇలా జరుగుతుందని కనుగొన్నారు. దీనినే స్టార్చ్ రెట్రోగ్రేడేషన్ ప్రాసెస్ అంటున్నారు. ఈ పరిస్థితిలో చల్లారిన తరువాత జీర్ణమయ్యే పిండి పదార్థం బాడీలోని షుగర్ ను స్పైకి చెయ్యలేదు. పైగా గట్ ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుందని చెబుతున్నారు.