కల్తిని గుర్తించండిలా...!

lakhmi saranya
ఈరోజుల్లో ప్రతి ఆహారం కూడా కల్తీ అవుతున్న సంగతి తెలిసిందే. కూరగాయల దగ్గర నుంచి పండ్ల వరకు కూడా కల్తీ అవుతున్నాయి. ఇటీవల కాలంలో ఆహార పదార్థాల విషయంలో బాగా కల్తీ జరుగుతోంది. ఏది తినాలి ఏది తినకూడదు కూడా తెలియకుండా పోతుంది. అనేక ఆహార పదార్థాలు, పండ్లు, మసాలాలు, పాలు వంటి వాటిలో ఎక్కువగా కల్తీ జరుగుతోంది. వీటిలో వివిధ రకాల రసాయనాలు ఉపయోగించి తక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. కల్తీ ఆహార పదార్థాలు తీసుకోవటం వల్ల ఆరోగ్య సమస్యలు దారితీస్తుంది.
ఇటువంటి కల్తీ పదార్థాలను ప్రతిరోజు తినడం వల్ల కాలేయం, మూత్రపిండాల సమస్యలు, జీర్ణ క్రియ సమస్యలు తలెత్తుతున్నాయి. అందుకే ఈ సమస్యలను దూరం చేసేందుకు ఒక్కసారి పదార్థాలను చెక్ చేసుకోవటం మంచిది. ఎలా ఇప్పుడు చూద్దాం. బెల్లంలో కల్తీ జరిగిందా లేదా అని నీళ్లను ఉపయోగించి తెలుసుకోవచ్చు. బెల్లంలో మెటానిల్ పసుపు రంగును కలిపి కల్తీ చేస్తారు. బెల్లం ఒరిజనల్ అని తెలుసుకోవాలంటే దాన్ని ఇళ్లలో వేస్తే సరిపోతుంది. మంచి బెల్లం అయితే నీటిలోనే కరిగిపోతుంది. కల్తీది అయితే నీటి అడుగున తేట్టులా తేలుతుంటుంది. ఈరోజుల్లో తాగే పాలు కూడా కల్తీగా మారిపోతున్నాయి. పాలలో ఎక్కువగా నీళ్లు కలపడమే కాకుండా...
 అవి చిక్కగా ఉండటం కోసం డిటర్జెంట్లు, సింథటిక్ పాలను కూడా కలుపుతారు. దీనిని గుర్తించాలంటే పాలను వేళ్ల మధ్యలో రుద్దినప్పుడు అది సబ్బు నురగలా వస్తే అది సింథటిక్ పాలని అర్థం. పంచదారలో సున్నం లేదా ప్రోస్టిక్ పొడిని కలుపుతుంటారు. ఇది కల్తీదా లేదా అని తెలుసుకోవాలంటే ఒక గ్లాసు నీటిని తీసుకొని, అందులో టీ స్పూన్ పంచదారను వేసి నీటిలో బాగా కలపాలి. ఆ నీరు స్వచ్ఛంగా ఉంటే మంచిది అని అలా కాకుండా కొన్ని చిన్నచిన్న కణాలు కరగకుండా కనిపిస్తే అది కల్తీ అని గుర్తించాలి. ఒక గ్లాసు నీటిని తీసుకుని అందులో కొంచెం పసుపు కలపండి. అది కల్తీ అయితే గ్లాసు అడుగు భాగంలో పసుపు కనిపిస్తుంది. కల్తీ పసుపు ఉన్న నీరు మరింత పసుపు రంగులో కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: