బాడీ లాంగ్వేజ్ మీ వ్యక్తిత్వాన్ని చెప్పేస్తుంది...! అదెలాగో తెలుసా..?

lakhmi saranya
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ చాలా స్టైలిష్ గా మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. ఎదుటివారు ఎలాంటివారో తెలుసుకోవాలనే ఆసక్తి చాలా మందికి ఉంటుంది. అయితే, వాళ్లు గురించి... వారి వ్యక్తిత్వాన్ని గురించి తెలుసుకోవాలని అనుకుంటే... వారితో కొంత సమయం మాట్లాడడం లేదా గడపడం వంటివి చేయాలని అనుకుంటారు. ప్రతి శరీరానికి ఒక భాష ఉంటుంది. దాని ఆధారంగా కూడా మొదటి వ్యక్తి గురించి తెలుసుకోవచ్చు. ఎదుటివారి లాంగ్వేజ్ ను బట్టి వారు ఎలాంటి వారు? వారి వ్యక్తిత్వం ఏమిటి? అనేది తెలుసుకోవచ్చు.
కొందరు మాట్లాడుతున్నప్పుడు ఆసక్తికరంగా వినాలని అనిపిస్తుంది. మరికొందరు ఏం మాట్లాడినా వెంటనే చిరాకు వస్తుంది. దానికి కారణం వాళ్ళ బాడీ లాంగ్వేజ్ విధానం సరిగ్గా లేదని అర్థం. అయితే, చాలామందికి దీనిపై సరైన అవగాహన ఉండదు. కొందరికి వాళ్ల శరీరం ఎలా ప్రవర్తిస్తుందో పెద్దగా గుర్తించలేకపోతారు. ఎవరైనా సరే నీ బాడీ లాంగ్వేజ్ సరిగ్గా లేదని చెప్పగానే వెంటనే బాధపడుతుంటారు. రాము ఎందుకు పనికిరామని అనుకుని, ఆందోళన చెందుతారని నిపుణులు చెబుతున్నారు. మీరు అందరిలో ప్రత్యేకంగా, సామర్ధ్యవంతమైన గట్టిగా నిలవాలంటే దానికి మీ బాడీ లాంగ్వేజ్ ప్రధానమని తెలుసుకోవాలి.
శరీర భంగిమ ఆధారంగా మీ మూడ్ ఏంటో ఎదుటి వారికి తెలుస్తుందని నిపుణులు చెబుతున్నారు. మీతో మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వ్యక్తి పదేపదే ముక్కు మీద లేదా తలపై రుద్దుకోవడం వంటిది చేస్తుంటే వారు మిమ్మల్ని వ్యతిరేకమైన దృష్టితో చూస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. మాట్లాడేటప్పుడు మీ కాళ్లల్లోకి సూటిగా చూస్తూ... మిమ్మల్ని ఇబ్బంది పడేలా చేస్తున్నారంటే వారు మీతో అబద్ధం చెపుతున్నారని. అలా కాకుండా రెప్పవేయకుండా అలాగే చూస్తున్నట్లయితే మిమ్మల్ని పరిశీలిస్తున్నారని అర్థం. ఎదుటి వ్యక్తి మనల్ని చూసే చూపుతో కూడా వారు ఎలాంటి వారనేది తెలుసుకోవచ్చు. అయితే, చాలామందికి దీనిపై సరైన అవగాహన ఉండదు.  కొందరికి వాళ్ల శరీరం ఎలా ప్రవర్తిస్తుందో పెద్దగా గుర్తించలేకపోతారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: