వారానికి 2 సార్లు ఈ అన్నం తింటే చాలు...!
దీనిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సామలతో తయారుచేసిన కిచిడిని మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో తినటం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారికి ఏ ఫుడ్ ఎంత మేలు చేస్తుంది. మామూలుగా విజిటేబుల్ రైస్ చేసుకున్నట్లు దీనిని తయారు చేసుకోవచ్చు. డయాబెటిస్ ఉన్నవారికి మాత్రమే కాదు.. దీనిని ఎవ్వరైనా తినవచ్చు. సామలు, బంగాళాదుంపలు, క్యారెట్, పచ్చిమిర్చి, నెయ్య లేదా నూనె, అల్లం, కొత్తిమీర, కరివేపాకు, బీన్స్, ఉప్పు, జీలకర్ర, పల్లీలు, కొద్దిగా నిమ్మరసం. దీనిని తయారు చేసుకోవాలంటే... ముందుగా సామలను ఐదు లేదా ఆరు గంటల పాటు నానబెట్టాలి. ఆ తరువాత వీటిని కడిగి పక్కన పెట్టుకోవాలి.
బంగాళదుంపలు, బీన్స్ ను ఉడికించి పక్కన పెట్టుకోవాలి. బంగాళా దుంపలు ఉడికిన తరువాత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి నూనె లేదా నెయ్యిని వేసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత అందులో కొంచెం జీలకర్ర, పల్లీలు, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం తరుగు, క్యారెట్, ఇలా ఒకదాని తరువాత ఒకటి వేసి వేయించాలి. ఆ తరువాత బంగాళదుంప ముక్కలు, ఉప్పు వేసి బాగా కలుపుకొని చిన్న మంట మీద కొంచెం సేపు వేయించుకోవాలి. నానబెట్టిన సామలను మిశ్రమంలో వేసి, రెండు కప్పుల నీటిని పోసి, బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు అందులో కొత్తిమీర, కొంచెం నిమ్మరసం కలుపుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే సామల కిచిడీ రెడీ అయిపోయింది.