వ్యసనంగా మారుతున్న ఆన్ లైన్ గేమింగ్.. కారణం ఇదేనా!

lakhmi saranya
ఈరోజుల్లో ప్రతి ఒక్కరూ ఆన్లైన్ గేమ్స్ కి అలవాటు పడిపోతున్నారు. ఆన్లైన్ గేమ్స్ కి అలవాట పడిపోయే ఎంత పడితే అంత డబ్బు నీకు ఖర్చు చేసేస్తున్నారు. మద్యపానం, ధూమపానం వంటి వ్యసనాలకు బానిసైతే ఆరోగ్యం పాడవుతుంది. అయితే ప్రస్తుతం ఆన్ లైన్ గేమింగ్ వ్యసనం అంతకంటే ప్రమాదకరంగా మారుతోందని నిపుణులు చెబుతున్నారు. సెల్ ఫోన్ , ఇంటర్నెట్ వంటివి అవసరాలకి వాడుకుంటే ప్రయోజనం ఉంటుంది. మీ అతిగా వాడటం వల్లే వ్యసనం గా , ప్రాణాంతకంగా మారుతున్నాయి.
సరదా కోసం ఆడే వీడియో గేమ్ లకు, అవసరానికి రుణాలిచ్చే యాప్ లకు అలవాటు పడిన వారు క్రమంగా ఇంటర్నెట్ గేమింగ్ డిజాస్టర్ వంటి మానసిక రుగ్మతాలను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ జనాభాలో 1.7 శాతం నుంచి 10 శాతం మందిని ఆన్ లైన్ గేమింగ్ ఏదో ఒక రూపంలో ప్రభావితం చేస్తోందని నివేదికలు పేర్కొంటున్నాయి. ఇండియాలో కూడా బెట్టింగ్ యాప్ లు, ఆన్ లైన్ గేమింగ్ వ్యసనాలకు, వాటి నిర్వాహకుల అరాచకాలకు పలువురు ప్రభావితం అవుతున్నారు. కొందరు అప్పులు చేసి మరీ ఆన్ లైన్ గేమ్స్ ఆడడం, బెట్టింగ్ లకు పాల్పవడం వంటివి చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
సైబర్ నేరస్థులు, అప్పుల మాఫియా చేతిలో బ్లాక్ మెయిల్ కు ఆత్మహత్యలకు పాలవుతున్న సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆశ, అవగాహన రహిత్యం నలుగురిని ఆన్ లైన్ గేమ్ లకు, రుణాలిచ్చే యాప్ లకు అడిక్ట్  అయ్యేలా చేస్తుంది. ఇదే అదునుగా షాపింగ్, ఫ్రాంచైజీల అమ్మకాలు, అశ్లీల వీడియోలతో, ఫోటోలతో టాప్ చేయడం, గిఫ్ట్ మనీ పేరిట సైబర్ మోసాలకు పాలవడం వంటి సంఘటనలు తరచుగా ఎక్కడో ఒకచోట చోటు చేసుకుంటున్నాయి. ప్రపంచ జనాభాలో 1.7 శాతం నుంచి 10 శాతం మందిని ఆన్ లైన్ గేమింగ్ ఏదో ఒక రూపంలో ప్రభావితం చేస్తోందని నివేదికలు పేర్కొంటున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: